'కల్కి' పబ్లిక్ టాక్.. ఇలాంటి సినిమా చూడలేదంటున్న ఆడియన్స్?

praveen
ఎన్నో రోజులుగా భారత సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచ సినీ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న కల్కి మూవీ నేడు ఎంతో గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ప్రేక్షకులు అందరూ కూడా థియేటర్లకు బారులు తీరుతున్నారు. అయితే కల్కి మొదటి షో టాక్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోట్లాదిమంది అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అని చెప్పాలి. కాగా ఇప్పటికే ఇండియాలో కల్కి మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి.

 ఈ క్రమంలోనే పబ్లిక్ టాక్ బయటకు వచ్చేసింది. ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2898 ఏడి సినిమా గ్రాండ్గా రిలీజ్ అవ్వగా.. ఓవర్సీస్ లో ఇప్పటికే ప్రీమియర్ షో పూర్తయింది. అయితే ఈ మూవీకి సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది అన్నది తెలుస్తుంది. ఈ మూవీ ఆరంభంలోనే సీన్స్ అదిరిపోయాయని.. సినీ ప్రేక్షకులు చెబుతున్నారు. టాలీవుడ్ నుంచి ఇప్పటివరకు ఇలాంటి సినిమాలు చూడలేదు అని అభిప్రాయపడుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని ప్రభాస్, అమితాబ్ నటన క్లైమాక్స్ సీన్స్ ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తాయి అంటూ తెగ పొగిడేస్తున్నారు సినీ ప్రేక్షకులు. అయితే ఫస్ట్ ఆఫ్ లో కొన్ని సీన్లు స్లోగా అనిపించాయని.. అయినప్పటికీ ఇది సినిమాపై ఎక్కడ ప్రభావం చూపబోదు అంటూ చెబుతున్నారు.

 ఇలా ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ మూవీ కల్కి సినిమాకు ఇక పాజిటివ్ రివ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి అని చెప్పాలి. కాగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని వైజయంతి మూవీస్ నిర్మించింది. ఇక ఈ సినిమాలో అమితాబచ్చన్, కమల్ హాసన్, దీపిక పదుకొనే లాంటి స్టార్లు కీలకపాత్రలో నటించారు. ఇక సినిమా విడుదలకు ముందు విడుదలైన రెండు ట్రైలర్లు కూడా ఈ మూవీపై ఉన్న అంచనాలను ఒక రేంజ్ లో పెంచేసాయ్. ఏకంగా బాలీవుడ్ మూవీ ని మించిపోయేలా ఈ సినిమా ఉండబోతుంది అని అభిమానులు అందరూ కూడా భావించారు. అందుకు తగ్గట్లుగా కాదు అంతకుమించి అనే రేంజ్ లోనే సినిమా ఉంటుందని ఇక ఇప్పుడు పబ్లిక్ టాక్ బయటకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: