నెల్లూరు జైలుకి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి..!

FARMANULLA SHAIK
మాచర్లలో రాజకీయ అరాచకాలకు కేరా్‌ఫగా మారిన వైసీపీ మాజీ శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆట ఎట్టకేలకు కట్టింది. ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్లపై దౌష్ట్యానికి పాల్పడిన కేసుల్లో నరసరావుపేటలో బుధవారం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుల్లో ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్లు బుధవారం తిరస్కరణకు గురయ్యాయి. ఆ వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. మధ్యాహ్నం 3.47 గంటల సమయంలో పిన్నెల్లిని అదుపులోకి తీసుకుని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అరెస్టు వార్తను ఎస్పీ మల్లికాగార్గ్‌ రాత్రి 7 గంటల సమయంలో ధ్రువీకరించారు. ఆయనను వైద్య పరీక్షల నిమిత్తం ఎస్పీ కార్యాలయం నుంచి నరసరావుపేటలోని ప్రభుత్వ ఆస్పత్రికి 8 గంటల సమయంలో తరలించారు. అనంతరం 9.13 గంటలకు ఆస్పత్రి నుంచి ఎస్పీ కార్యాలయానికి తిరిగి తీసుకొచ్చారు. మాచర్ల నియోజకవర్గంలో కేసులు నమోదు కావడంతో ఆయనను మాచర్ల కోర్టులో హాజరు పరచాలని పోలీసులు నిర్ణయించారు. రాత్రి 10 గంటల సమయంలో ఎస్పీ కార్యాలయం నుంచి పిన్నెల్లిని మాచర్ల కోర్టులో హాజరు పరిచేందుకు తరలించారు. పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మొత్తం పిన్నెల్లిపై 14 కేసులు నమోదయ్యాయి. వీటిలో మూడు హత్యాయత్నం కేసులు ఉన్నాయి.

మే 13న మాచర్ల నియోజకవర్గం పాల్వయి గేటు వద్దగల పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఇవిఎంలను ధ్వంసం చేసినట్లు, అడ్డుకోబోయిన టిడిపి ఏజెంట్‌పైనా, అదే రోజు రెంటచింతలలో మహిళపైనా, ఆ మరుసటి రోజు కారంపూడిలో సిఐపైనా హత్యాయత్నం చేసినట్లు పిన్నెల్లిపై గతంలో కేసులు నమోదయ్యాయి.ఏపీలో పోలింగ్ అనంతరం పిన్నెల్లి విషయంలో పెద్ద హైడ్రామా నడిచింది. ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ కొన్ని మీడియా ఛానెల్స్ ప్రచారం చేశాయి. అయితే ఆ వార్తలను ఆయన ఎప్పటకిప్పుడూ ఖండిస్తూ వచ్చారు. మాచర్ల నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. ఇటీవలి ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి చేతిలో ఓడిపోయారు.మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మాచర్ల జూనియర్ సివిల్ కోర్ట్ జడ్జి 14 రోజుల రిమాండ్ విధించారు.టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు, కారంపూడి సిఐ పై దాడి కేసుల్లో రిమాండ్ విధించగా ఈవీఎం ద్వంసం, మహిళపై దాడి కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. పిన్నిల్లిని నెల్లూరు జైల్ కి తరలించాలని జడ్జి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: