కల్కి 2898AD: ఆ పాత్రలో అదరగొట్టేసిన విజయ్ దేవరకొండ..!

Divya
టాలీవుడ్ లో మోస్ట్ అవైడెడ్ మూవీ గా పేరు పొందింది కల్కి.. ఎట్టకేలకు ఈ రోజున థియేటర్లో ఈ సినిమా విడుదలై భారీ విజయదిశగా దూసుకుపోతోంది. భారత పురాతనాల, ఇతిహాసాల ఆధారంగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ నాగ్ అశ్విన్ తన సొంత టాలెంట్ తో తెరకెక్కించారు. ముఖ్యంగా విష్ణుమూర్తి పదవ అవతారమైన కల్కి అవతారాన్ని ఈ చిత్రంలో చూపించినట్లుగా తెలుస్తోంది. దాదాపుగా రూ.600 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా భారీతారాగణంతోపాటు హైటెక్నికల్ వాల్యూస్ కల్కి చిత్రాన్ని నాలుగున్నరలుగా రూపొందించారు.

ఈ సినిమా ఇప్పటికే యూఎస్ తో పాటు అనేక చోట్ల కూడా ప్రీమియం షోలు కూడా ప్రదర్శించారు. తాజాగా ఈరోజు విడుదలైన ఈ సినిమా ట్విట్టర్ వేదికగా అభిమానులు తమ అభిప్రాయాలను కూడా వెల్లడిస్తున్నారు.. ముఖ్యంగా ఒక నెటిజన్ కల్కి బ్లాక్ బాస్టర్ లోడింగ్ మొదటి 15 నిమిషాలు అసలు మిస్ కావద్దు.. కీలకమైన పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్ అదిరిపోయింది అంటూ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. విజయ్ దేవరకొండ అర్జున పాత్రలో ఇందులో నటించినట్లుగా తెలుస్తోంది. తలరాతలు రాసిన బ్రహ్మదేవుడి రాసిన గాండీవం ఇది.. దీనిని ఎవరు అడ్డుకోలేరు.. అంటూ చెప్పే డైలాగ్స్ ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తోంది. అయితే విజయ్ దేవరకొండ ఈ చిత్రంలో ఉన్నారనే విధంగా ఎవరు ఊహించలేదు.. ఎక్కడ కూడా ఈ చిత్రానికి సంబంధించి ఈ విషయాన్ని బయట పెట్టలేదు చిత్ర బృందం.


ఫస్ట్ ఆఫ్ వరల్డ్ క్లాసు గా ఉందని హాలీవుడ్ లెవెల్ లో ఉందంటూ మరి కొంతమంది తెలియజేస్తున్నారు థియేటర్లో తప్పక చూడవలసిన సినిమా అంటూ తెలిపారు. ఇంటర్వెల్స్ ఇన్ అదిరిపోయిందని ప్రతి పది నిమిషాలకు ఒక కొత్త క్యారెక్టర్ సడన్ సర్ప్రైజ్ చేస్తుంది అంటూ తెలిపారు. మరి ఎలాంటి రికార్డులను సైతం కల్కి చిత్రం తిరగరాస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: