నా కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోను : పాక్ ప్లేయర్

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యుఎస్ వేదికలుగా t20 వరల్డ్ కప్ టోర్ని ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నిలో పోరు చూసి ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన టీమ్స్ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఉంటే భారీ అంచనాలతో వరల్డ్ కప్ లో బరిలోకి దిగిన అగ్రశ్రేణి టీమ్స్ మాత్రం చెత్త ప్రదర్శన చేశాయి  కొన్ని టీమ్స్ అయితే కనీసం సూపర్ 8 కి కూడా అర్హత సాధించలేక టోర్ని నుండి నిష్క్రమించాయి అని చెప్పాలి.

 అయితే నేటి నుంచి కీలకమైన సూపర్ 8 మ్యాచ్లు జరుగుతూ ఉండడం గమనార్హం. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఎంత భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాబర్ కెప్టెన్సీలో ఈసారి పాకిస్తాన్ తప్పకుండా టైటిల్ విజేత నిలుస్తుందని.. ఆ జట్టు అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు  కానీ చివరికి చూస్తే ఆ జట్టు వరుస ఓవటములతో సతమతమైన చివరికి సూపర్ 8 లో కూడా అర్హత సాధించలేక లీగ్ దశతోనే టోర్ని నుంచి నిష్క్రమించింది.

 పాకిస్తాన్ క్రికెటర్ల పై తీవ్ర స్థాయిల విమర్శలు వస్తుండగా.  ఇక ఆ జట్టు ఆటగాళ్ల ప్రవర్తన కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది  ఎందుకంటే ఇటీవల పాకిస్తాన్ జట్టులో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న హరీష్ రావుఫ్ ఏకంగా ఒక అభిమానిని కొట్టడానికి వెళ్లిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది  ఈవిషయంపై పాకిస్తాన్ ఆటగాడు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఎవరైనా హద్దులు దాటి తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోను అంటూ హెచ్చరించాడు. అమెరికాలోని ఒక హోటల్లో జరిగిన గొడవపై స్పందిస్తూ ఈ గొడవను సోషల్ మీడియా చర్చకు తీసుకురావద్దని అనుకున్నాను. కానీ ఇప్పుడు స్పందించాల్సి వచ్చింది. ఫ్యాన్స్ కొన్నిసార్లు విమర్శిస్తారు. కొన్నిసార్లు ప్రశంసిస్తారు   కానీ కుటుంబం ఎవరిదైనా సరే గౌరవించాలి అంటూ హరీష్ రావుఫ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: