చంద్రబాబు ఫస్ట్ వీక్ పాలన రివ్యూ.. ఆ నిర్ణయాలతో ఏపీ ప్రజలు హ్యాపీనే కానీ?

Reddy P Rajasekhar
ఏపీలో చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించి వారం రోజులైంది. ఈ వారం రోజుల్లో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు కానీ పరిపానల సాగించిన తీరు కానీ సామాన్య ప్రజల మెప్పు పొందుతోంది. కొందరు టీడీపీ టాప్ నేతల కామెంట్లు ఏపీ అధికారులను బాధ పెట్టేలా ఉన్నా ప్రజలకు మేలు చేసేలా కూటమి పాలన ఉండటం గమనార్హం. ఏప్రిల్ నెల నుంచి బాబు పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేయనున్నారు.
 
చంద్రబాబు ఫస్ట్ వీక్ పాలన రివ్యూకు మంచి మార్కులే పడుతున్నాయి. చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో ఏపీ ప్రజలు ఒకింత హ్యాపీగానే ఉన్నారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే కొన్ని పథకాలు, ఆ పథకాల షరతులకు సంబంధించి సోషల్ మీడియాలో వేర్వేరు వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.
 
అయితే కూరగాయల ధరలపై ఏపీ ప్రభుత్వం కొంతమేర దృష్టి పెట్టాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల ప్రజలు కరెంట్ కోతల వల్ల ఇబ్బందులు పడుతున్నారని సమాచారం అందుతోంది. ఈ సమస్యలు చిన్నచిన్న సమస్యలే అయినా ఈ సమస్యల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబు ఫస్ట్ వీక్ పాలన నూటికి 90 మార్కులు సాధించేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
మరోవైపు వచ్చే ఏడాది కాలంలో చంద్రబాబు ఇచ్చిన ప్రతి హామీ అమలు దిశగా అడుగులు వేయాల్సి ఉంది. నెలకు కొన్ని హామీల అమలు చొప్పున బాబు అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఏపీకి బెస్ట్ సీఎం కావాలనే ఆకాంక్ష నెరవేరాలని టీడీపీ కార్యకర్తలు భావిస్తున్నారు. గతంలో బాబు చేసిన తప్పులు ఈ దఫా చేయకూడదని చంద్రబాబుకు కార్యకర్తలు సూచిస్తున్నారు. చంద్రబాబు పాలన ఇతర రాష్ట్రాలకు సైతం ఆదర్శంగా నిలిచే విధంగా ఉండాలని మరి కొందరు సూచనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో బాబు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: