సిక్సర్లు కొట్టడంలో.. గేల్ రికార్డు బద్దలు కొట్టేసాడుగా?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే బ్యాట్స్మెన్ల విధ్వంసానికి మారుపేరుగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే అతి తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేయాలి అనే మైండ్ సెట్ తో ఆటగాళ్లు అటు బరిలోకి దిగుతూ ఉంటారు. కాబట్టి.. ఇక రావడం రావడమే సిక్సర్లు ఫోన్లతో చెలరేగిపోతూ ఉంటారు. బంతి ఎక్కడ వేసినా కూడా ఇక దంచి కొట్టేస్తూ ఉంటారు. దీంతో టి20 ఫార్మాట్లో బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇప్పటివరకు టి20 ఫార్మాట్లో స్టార్ బ్యాట్స్ మెన్లుగా పేరు సంపాదించుకున్న వారు కొంతమంది ఉన్నారు  అలాంటి వారిలో యూనివర్సిటీ బాస్ గా పిలుచుకునే క్రిస్ గేల్ కూడా ఉంటాడు అని చెప్పాలి.

 క్రిస్ గేల్ తో పాటు అటు భారత స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ కూడా టి20 ఫార్మాట్లు తోపు బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు. మొన్నటి వరకు టీ20 ఫార్మాట్లో క్రిస్ గేల్ తర్వాత అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్గా అటు సూర్య కుమార్ యాదవ్ అరుదైన రికార్డు సృష్టించి ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు సూర్యకుమార్ రికార్డులు మాత్రమే కాదు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును కూడా బద్దలు కొట్టేశాడు ఒక స్టార్ ప్లేయర్. అతను ఎవరో కాదు వెస్టిండీస్ ప్లేయర్ నికోలాస్ పూరన్.

 అంతర్జాతీయ టి20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఐదవ ఆటగాడిగా వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్ రికార్డ్ సృష్టించాడు  ఇప్పటివరకు పూరన్ టి20 ఫార్మాట్లో 128 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ 124, సూర్య కుమార్ యాదవ్, పించ్ 125 సిక్సర్ల రికార్డును బద్దులు కొట్టాడు. అయితే ఈ లిస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 194 సిక్సర్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు అని చెప్పాలి. మార్టిన్ గప్తిల్ 173, జాస్ బట్లర్ 130, మ్యాక్స్ వెల్ 129 సిక్సర్లతో ఈ లిస్టులో తర్వాత స్థానంలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: