రోహిత్, నేను ఒకే స్కూల్ : అమెరికా క్రికెటర్

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడ అని ఎదురుచూసిన టి20 వరల్డ్ కప్ జూన్ రెండవ తేదీన ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ప్రపంచకప్ టోర్నికి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్ఏ జట్టు ఐసీసీ టోర్నీలో అర్చనాలకు మించి రాణిస్తుంది. ఏకంగా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ అటు సూపర్ 8 లో అర్హత సాధించేలాగా కనిపిస్తుంది.

 టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుపై ఏకంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది. దీంతో అందరి చూపు కూడా అమెరికా జట్టు పైనే పడింది. అయితే అమెరికా జట్టులో దాదాపుగా సగానికి పైగా ఆటగాళ్లు భారత సంతతికి చెందిన ఆటగాళ్లే ఉండడం గమనార్హం. మరి ముఖ్యంగా ఆ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న హర్మీత్ సింగ్ గతంలో ఇండియాలో అండర్ 19 వరకు క్రికెట్ ఆడిన ప్లేయర్ కావడం విశేషం. అయితే ఇటీవల హర్మీత్ సింగ్ టీమిండియా ఆటగాళ్లతో ఉన్న తన బంధాన్ని గుర్తు చేసుకున్నాడు. అంతేకాదు రోహిత్ శర్మ గురించి ఒక షాకింగ్ విషయాన్ని చెప్పుకొచ్చాడు ఈ అమెరికా ప్లేయర్.

 ప్రస్తుతం భారత జట్టుకు కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ తాను ఒకే స్కూల్ అంటూ యూఎస్ఏ ప్లేయర్ హర్మీత్ సింగ్ చెప్పుకొచ్చాడు. తాను పాఠశాలలో చేరే సమయానికి హిట్ మాన్ పట్టభద్రుడు అయ్యాడు అంటూ తెలిపాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ అరంగేట్రాం మ్యాచ్లో రోహిత్ కూడా ఉన్నాడు అంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం టీమిండియాలో ఉన్న సంజు శాంసన్, అక్షర పటేల్, కుల్దీప్ యాదవ్ లతో తాను అండర్ 19 టీమిండియా జట్టులో కలిసి ఆడినట్లు హర్మీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ముంబై ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో అదరగొడుతూ ఉండడం ఆనందంగా ఉంది అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: