T20 వరల్డ్ కప్ లో.. అరుదైన రికార్డు?

praveen
ప్రస్తుతం వెస్టిండీస్, యూఎస్ వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్ కప్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆట తీరుతో అన్ని టీమ్స్ కూడా ఆకట్టుకుంటున్నాయి. అయితే అగ్రశ్రేణి టీమ్స్ కొన్ని మ్యాచ్లలో తడబడుతూ ఉంటే.. అటు ఎలాంటి అంచనాలు లేని చిన్న జట్లు మాత్రం అదరగొట్టేస్తూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆయా మ్యాచ్లలో జట్ల ప్రదర్శన పై ఎంతో మంది మాజీ ప్లేయర్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఈ టి20 వరల్డ్ కప్ ఎన్నో అరుదైన రికార్డులకు వేదికగా కూడా మారిపోయింది అని చెప్పాలి. ఇటీవలే మరో రికార్డు నమోదయింది. సాధారణంగా ఒక మ్యాచ్లో భారీ స్కోరు నమోదయిందంటే.. ఇక జట్టులోని బ్యాట్స్మెన్లు హాఫ్ సెంచరీలు సెంచరీలు చేయడం కారణంగానే ఇలా భారీ స్కోరు రావడం చూస్తూ ఉంటాం. కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఒక్క ఆటగాడు కూడా హాఫ్ సెంచరీ చేయకపోయినప్పటికీ.. ఓ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదయింది. ఇలా హాఫ్ సెంచరీలు చేయకుండా భారీ స్కోరు చేయడమే ఒక అరుదైన రికార్డుగా మారిపోయింది అని చెప్పాలి.

 టి20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇటీవల ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్లో రెండు జట్లు కలిపి 366 పరుగులు చేశాయ్. ఇందులో ఆస్ట్రేలియా 201 పరుగులు చేయగ ఇంగ్లాండ్ 165 పరుగులు చేసింది  అయితే ఈ మ్యాచ్ లో ఒక అరుదైన రికార్డు నమోదయింది. ఒక్క ప్లేయర్ కూడా 50 ప్లస్ స్కోర్ చేయకుండా అత్యధిక స్కోర్ నమోదైన మ్యాచ్ గా ఇది రికార్డు సృష్టించింది. అంతకుముందు 2010లో సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్లో ఇలా ఒకరు కూడా 50 ప్లస్ స్కోర్ చేయకుండా 327 పరుగులు నమోదయ్యాయ్. ఇక ఇప్పుడు ఈ రికార్డును ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్ లో బట్లర్ చేసిన 45 పరుగులే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: