
IND vs Pak మ్యాచ్ కు ఉగ్ర ముప్పు.. ఆందోళనలో ఫ్యాన్స్?
అయితే క్రికెట్ సంబంధాలపై ఇరుదేశాల మధ్య నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కేవలం అటు ఐసిసి టోర్నీలలో మాత్రమే పాకిస్తాన్, ఇండియా మధ్య మ్యాచ్ చూసేందుకు అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కేవలం రెండు దేశాల క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ మ్యాచ్ ని చూసేందుకు తెగ ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. మరికొన్ని రోజుల్లో మరోసారి ఈ చిరకాల ప్రత్యర్ధుల పోరు జరగబోతుంది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జూన్ 9వ తేదీన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ న్యూయార్క్ వేదికగా జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ ని చూసేందుకు అటు అభిమానులు అందరూ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో ఇక ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ కు సంబంధించి ఒక విషయం అందరిని ఆందోళనకు గురిచేస్తుంది. జూన్ 9వ తేదీన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కు ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు సమాచారం. మ్యాచ్ సమయంలో అలజడి సృష్టించే అవకాశం ఉండడంతో.. భారీ భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు నాసౌ కౌంటి పోలీస్ కమిషనర్ పెట్రిక్ తెలిపారు. డ్రోన్ దాడులకు అవకాశం ఉన్నందున మ్యాచ్ జరుగుతున్న ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. మరోవైపు ఇక ఈ మ్యాచ్ కు పట్టిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలని అటు న్యూయార్క్ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు అన్నది తెలుస్తుంది.