వరల్డ్ కప్ కోసం.. రోహిత్, హార్దిక్ అమెరికా వెళ్ళేది అప్పుడేనట?

praveen
గత కొంతకాలం నుంచి ఐసీసీ ట్రోఫీలు గెలవడంలో వెనుకబడిపోయింది టీమిండియా. అలా అని బాగా రాణించడం లేదా అంటే అది లేదు. ఇక ప్రతి వరల్డ్ కప్ లో కూడా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ అందరి అంచనాలకు తగ్గట్లుగానే రాణిస్తుంది. కానీ కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో మాత్రం ఇక తడబడుతూ చివరికి ఓటమి పాలై టోర్ని నుంచి నిష్క్రమిస్తూ వస్తుంది. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో కూడా ఇదే జరిగింది అన్న విషయం తెలిసిందే.

 మొదటి మ్యాచ్ నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఫైనల్ వరకు దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగించింది. దీంతో ఫైనల్లో కూడా విజయం సాధిస్తుంది అనుకున్నప్పటికీ చివరికి ఆస్ట్రేలియా తో మ్యాచ్లో తడబడి చివరికి రన్నర్ ఆఫ్ తోనే సరి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మాత్రం తప్పక టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే బీసీసీఐ కూడా జట్టు సభ్యుల వివరాలను ప్రకటించింది. కాగా భారత ఆటగాళ్లు అటు వరల్డ్ కప్ ఆడేందుకు ఎప్పుడు అమెరికాకు వెళ్లబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 కాగా ఈ పొట్టి ప్రపంచకప్ కోసం టీం ఇండియా క్రికెటర్లు రెండు బ్యాచులుగా అమెరికా వెళ్ళబోతున్నారు అన్నది తెలుస్తుంది. ఐపీఎల్ లో ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన టీమ్లలో ఉన్న క్రికెటర్లు తొలి విడతలో అమెరికాకు ప్రయాణం కాబోతున్నారట. ఈ క్రమంలోనే ముంబై, పంజాబ్ జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించాయి. ఈ క్రమంలోనే రోహిత్, హార్దిక్ పాండ్యా, బుమ్రా, సూర్య కుమార్ యాదవ్, అర్షదీప్ లు ఇక ఈనెల 24వ తేదీన అమెరికాకు పయనం కాబోతున్నారట.  ఇక ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లు మే 27న లేదంటే 28వ తేదీన అమెరికా వెళ్లబోతున్నారు  అని బీసీసీఐ సెక్రటరీ జై షా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc

సంబంధిత వార్తలు: