కొవ్వూరు : వైసీపీని ముప్పుతిప్ప‌లు పెట్టి 33 వేల మెజార్టీతో గెలిచిన టీడీపీ ముప్పిడి

RAMAKRISHNA S.S.
ఉమ్మడి పశ్చిమగోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి కి అనుసంధానంగా గోదావరిని ఆనుకుని ఉన్న నియోజకవర్గం కొవ్వూరు. నియోజకవర్గం పునర్విభజనలో ఎస్సీలకు రిజర్వ్ చేయబడిన ఈ నియోజకవర్గంలో ప్లేస్ మారిన పాత ప్రత్యర్థులే ప్రధాన పార్టీల నుంచి పోటీ పడటం విశేషం. నియోజ‌క‌వ‌ర్గంలో కొవ్వూరు మున్సిపాల్టీతో పాటు కొవ్వూరు , చాగ‌ల్లు, తాళ్ల‌పూడి మండ‌లాలు ఉన్నాయి. 2014, 2019 ఎన్నికలలో గోపాలపురం నుంచి తెలుగుదేశం వైసీపీ అభ్యర్థులుగా పోటీపడిన గోపాలపురం సిట్టింగ్ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు.. మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఈసారి ఇద్దరూ నియోజకవర్గం మరి మళ్ళీ కొవ్వూరులోనూ ప్రత్యర్థులుగా మారటం విశేషం.

ముందు తలారి వెంకట్రావును జగన్ కొవ్వూరు కు బదిలీ చేయగా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముప్పుడిని కొవ్వూరు నుంచి పోటీ చేయించారు. వీరిద్దరూ మూడోసారి ప్రత్యర్థులుగా తలపడ్డారు. కొవ్వూరు నియోజకవర్గానికి ఇద్దరు నాన్ లోకల్ వ్యక్తులే.. అయితే ఇద్దరిదీ పక్కనే ఉన్న దేవరపల్లి కావటంతో ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు లేవు. నియోజకవర్గంలో రెండు పార్టీల నుంచి కమ్మ సామాజిక వర్గం వారి రాజకీయంగా ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. పెత్తనం అంత వారిదే.

అయితే ఓట్ల పరంగా చూస్తే కాపులు చాలా ఎక్కువ. తాజా ఎన్నికలలో జనసేన పొత్తు నేపథ్యంలో కాపులు, జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులు వన్ సైడ్ గా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచినట్లు కనిపిస్తోంది. దీనికి తోడు వైసీపీలోను కొన్ని వర్గాలు కూడా టీడీపీ అభ్యర్థి ముప్పుడి వెంకటేశ్వరరావుకు సపోర్ట్ చేసినట్టు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే పోలింగ్ సరళిని బట్టి చూస్తే స్వల్ప మెజార్టీతో అయినా తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ఎక్కువ మంది తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ రోజు జ‌రిగిన కౌంటింగ్‌లో ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు ఏకంగా 33 వేల ఓట్ల భారీ మెజార్టీతో ఘ‌న‌విజ‌యం సాధించారు.

గ‌త ఎన్నిక‌ల్లో త‌న‌ను గోపాల‌పురంలో 37 వేలతో ఓడించిన త‌లారి వెంక‌ట్రావును ఈ సారి 33 వేల ఓట్ల మెజార్టీతో ఓడించి ముప్పిడి వెంక‌టేశ్వ‌ర‌రావు భారీ రివేంజ్ తీర్చుకున్నార‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: