నన్ను నవ్వించే ఒకే ఒక్క వ్యక్తి అతనే : రోహిత్

praveen
ఇండియాలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ దృశ్య ఇక క్రికెటర్లకు సంబంధించి ఏ విషయం తెర మీదకి వచ్చినా కూడా అదే తెగ హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. కొన్ని కొన్ని సార్లు క్రికెటర్లు ఇక వివిధ ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఇక ప్రేక్షకులకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులతో పంచుకోవడం చేస్తూ ఉంటారు. ఇలా ఎవరైనా క్రికెటర్ ఏదైనా ఆసక్తికర విషయాన్ని చెబితే అది ఇక అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు రోహిత్ గురుంచి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా ఇలాగే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 సాధారణంగా రోహిత్ శర్మ ఎప్పుడు ఎంత సరదాగా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సహచర ఆటగాళ్లు అందరిని కూడా ఆట పట్టిస్తూ ఇక ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు. రోహిత్ సీరియస్ గా ఉన్న చూసింది చాలా తక్కువ అని చెప్పాలి. ఇలా అందరిని నవ్విస్తూ ఎప్పుడు సరదాగా గడిపే రోహిత్ శర్మ తను ఎప్పుడైనా నవ్వాలి అనుకున్నప్పుడు ఒక వ్యక్తిని కలుస్తాడట. అతన్ని కలిశానంటే చాలు ఇక ఎంతో నవ్వుకుంటాను అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.

 ఇంతకీ రోహిత్ శర్మ ఇలా నవ్వుకోవడానికి కలుస్తాను అని చెప్పిన వ్యక్తి ఎవరో కాదు టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహిత్ శర్మ రిషబ్ పంత్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. నన్ను నవ్వించేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది రిషబ్ పంత్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. అతను క్రేజీగా ఉంటాడు. ప్రమాదం కారణంగా కొన్ని రోజులు క్రికెట్కు దూరం అవడంతో చాలా నిరాశ చెందాను  అతను తిరిగి వచ్చి క్రికెట్ ఆడటం చూసి చాలా సంతోషించాను. నాకు ఎప్పుడైనా నవ్వాలి అనిపిస్తే వెంటనే రిషబ్ పంత్ తో మాట్లాడాలి అనుకుంటా అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: