నేను కూడా బ్యాటర్ అయ్యుంటే బాగుండేది : సన్రైజర్స్ కెప్టెన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ముగిసి రోజులు గడుస్తున్నాయ్. ఇంకా ఈ మ్యాచ్ గురించి చర్చ మాత్రం అస్సలు ఆగడం లేదు. ఈ మ్యాచ్ లో రెండు టీమ్స్ కూడా భారీ స్కోర్లు నమోదు చేయడం గమనార్హం.  ఒక రకంగా చెప్పాలంటే ఇరు జట్ల బ్యాట్స్మెన్లు బౌలర్లతో చేడుగుడు ఆడేశారు. బౌలర్లందరికీ కూడా ఒక బ్యాడ్ డే ని మిగిల్చారు అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు వీర విహారం చేసింది.

 వికెట్ల మధ్య పరిగెడుతూ సింగిల్స్ తీయడం కాదు ఏకంగా బౌండరీలతో చెలరేగిపోయారు ఆ జట్టు బ్యాట్స్మెన్లు. ఈ క్రమంలోనే ఏకంగా ఐపీఎల్ హిస్టరీ లోనే అత్యధిక స్కోర్ అయిన 277 పరుగులను బద్దలు కొట్టి.. ఏకంగా 287 పరుగులను చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. ఇంత భారీ టార్గెట్ ను చేదించడం అటు ఆర్సిబి వల్ల అస్సలు కాదు అనుకున్నారు. కానీ ఆ జట్టు సైతం ఏకంగా 250 పరుగులు చేసింది.ఇలా ఇరుజట్లు కలిపి భారీ స్కోర్ నమోదు చేశాయి అని చెప్పాలి. ఏకంగా 40 ఓవర్లలో 549 పరుగులు ఈ మ్యాచ్లో నమోదయ్యాయి.

 దీన్ని బట్టి ఇక బ్యాట్స్మెన్లు బౌలర్లకు ఎంతలా చుక్కలు చూపించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా ఇదే విషయంపై అటు సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నేను కూడా బ్యాట్స్మెన్ అయి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు. ముంబై జట్టుపై భారీ స్కోరు సాధించాక మరోసారి ఇలాంటి ప్రదర్శన చేయలేమని అనుకున్నా. కానీ మళ్ళీ భారీ స్కోరు బాదేసామ్. ఇలాంటి  మ్యాచ్లలో ఓవర్ కి ఏడు నుంచి 8 పరుగులు ఇస్తే ప్రభావం చూపొచ్చు. నాలుగు విజయాలు రావడం సంతోషంగా ఉంది. అయితే ఇలా భారీ పరుగులు చేయడంలో నేను కూడా బ్యాటర్ అయి ఉండి.. తన పాత్ర పోషించి ఉంటే బాగుండేది అంటూ ఫ్యాట్ కమిన్స్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: