కోహ్లీ, రోహిత్ కానీ.. ఆ ఇద్దరు లేకుండా టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదట?

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాకు వరల్డ్ కప్ గెలవడం అనేది అందని ద్రాక్ష లాగే మారిపోయింది. కెప్టెన్లు మారుతున్న వరల్డ్ కప్ కల మాత్రం సహకారం కావడం లేదు. అప్పుడెప్పుడో ధోని కెప్టెన్ గా ఉన్నప్పుడు చివరిసారిగా వరల్డ్ కప్ గెలిచింది టీం ఇండియా. ఇక అప్పటినుంచి ఎన్నోసార్లు ప్రపంచ కప్ టోర్నీలలో సత్తా చాటి సెమీఫైనల్, ఫైనల్ అంటూ చివరి వరకు చేరుకున్న ఇక ఒక్క అడుగు దూరంలో వరల్డ్ కప్ టైటిల్ గెలవలేక పోతుంది. దీంతో టీమిండియా కు ఫైనల్ ఫోబియా కూడా ఉంది అంటూ ఎంతోమంది విమర్శలు చేయడం కూడా చూస్తూ ఉన్నాం.

 గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో బరిలోకి దిగినప్పుడు కూడా ఇదే జరిగింది. ఏకంగా ఫైనల్ వరకు ఒక్క పరాజయం లేకుండా దూసుకుపోయిన టీమ్ ఇండియా.. ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయి మళ్ళీ నిరాశపరిచింది. అయితే జూన్ నెలలో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ లో మరోసారి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగబోతుంది భారత జట్టు. యూఎస్, వెస్టిండీస్ వేదికలుగా ఈ వరల్డ్ కప్ టోర్ని జరగబోతుంది. అయితే ఈసారి ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటుంది  బీసీసీఐ. ఐపీఎల్ లో బాగా రాణించిన ప్లేయర్లకు వరల్డ్ కప్ టీం లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది.

 ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ మైకల్ వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు వరల్డ్ కప్ గెలవాలంటే హార్దిక్ పాండ్యా టీం లో ఉండాలి. అంతేకాకుండా అతను బాగా ఆడాలి. అతనిలో ట్రోఫీలు గెలవగలిగే సత్తా నిండుగా ఉంది.. ఇక అంతే కాకుండా పంత్ కూడా చాలా కీలక ప్లేయర్ అవుతాడు. పంత్, హార్దిక్ లేకుండా భారత జట్టు టి20 వరల్డ్ కప్ గెలుస్తుందని నాకైతే అనిపించడం లేదు. పంత్ ఇప్పటికే మ్యాచ్ విన్నర్ గా నిరూపించుకున్నాడు.  పంత్ వికెట్ కీపర్ గా పాండ్య ఆల్ రౌండర్ గా ఉంటే భారత జట్టు విజయాపకాశాలు మెరుగుపడతాయి అంటూ మైకల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: