ఆ CSK ప్లేయర్.. టి20 వరల్డ్ కప్ జట్టులో ఉండాల్సిందే : యువరాజ్
కాగా ప్రస్తుతం ఇండియా వేదికగా జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఎంతో మంది ఆటగాళ్లు సత్తా చాటుతూ అదరగొట్టేస్తున్నారు. ప్రతి మ్యాచ్ లో కూడా దూకుడు అయిన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి ఆట తీరుతో అదరగొడుతున్న ఆటగాళ్లలో శివం దూబే ఒకరు. గత సీజన్లో ఎలా అయితే చెన్నై చెట్టు తరపున మెరుపు ఇన్నింగ్స్ లు ఆడి జట్టును టైటిల్ విజేతగా నిలపడంలో కీలకపాత్ర వహించాడడో.. ఇప్పుడు అదే రీతిలో చెలరేగిపోతున్నాడు. ప్రతి మ్యాచ్ లోను మెరుపు ఇన్నింగ్స్ లు ఆడుతూ అదరగొట్టేస్తున్నాడు శివం దూబే.
పొట్టి ఫార్మాట్ కు సరిగ్గా సరిపోయే ఆట తీరుతో అందరిని మెస్మరైస్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అతన్ని తప్పకుండా టి20 వరల్డ్ కప్ లో సెలెక్ట్ చేయాలి అంటూ ఎంతో మంది మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ స్పందించాడు. తప్పకుండా టి20 వరల్డ్ కప్ ఆడే భారత జట్టులో చెన్నై ఆల్రౌండర్ శివం దూబే ఉండాలి అంటూ అభిప్రాయపడ్డాడు. అతను సునాయాసంగా సిక్సర్లు కొట్టేస్తున్నాడు. జట్టులో గేమ్ చేంజర్ అవుతాడని అనిపిస్తుంది అంటూ యూవీ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఇటీవల సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 24 బంతుల్లో 45 పరుగులు చేసే అదరగొట్టాడు దూబే.