అయ్యయ్యో.. ఐపీఎల్ లో అత్యధిక ధర.. కానీ ఇలా ఆడాడేంటి?

praveen
2024 ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఇక ప్రేక్షకులు ఊహించిన దానికంటే అదిరిపోయే ఎంటర్టైర్మెంట్ అందుతుంది. ప్రతి మ్యాచ్ కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతుంది. దీంతో ఎంతో మంది క్రికెట్ ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోయి కన్నారపకుండా మ్యాచ్లను వీక్షిస్తున్నారు. కొంతమంది స్టేడియం కు వెళ్లి ఇక ప్రత్యక్షంగా మ్యాచ్ ను చూస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం ఐపీఎల్ ప్రారంభమైన నేపథ్యంలో అందరి కన్ను ఇద్దరి ఆటగాళ్లపైన ఉంది. ఆ ఇద్దరు ఎవరో కాదు ఆస్ట్రేలియా ప్లేయర్లు.

 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించి గత ఏడాది డిసెంబర్లో మినీ వేలం జరిగినప్పుడు ఇద్దరు ప్లేయర్లు భారీ ధర పలికారు. ముందుగా సన్రైజర్స్ హైదరాబాద్  ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ను 20.4 కోట్ల రూపాయల ధర పెట్టి కొనుగోలు చేసింది. దీంతో ఇదే ఐపీఎల్ హిస్టరీలో భారీ ధర అని అందరూ అనుకుంటుండగా.. అంతలోనే మరో ఆస్ట్రేలియా ప్లేయర్ అంతకు మించిన ధర పలికాడు. 24.75 కోట్లు పెట్టి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మిచెల్ స్టార్క్ ను జట్టులోకి తీసుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ ధర పలికిన ఇద్దరు ప్లేయర్లు ఎలా రాణిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

 అయితే ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఇందులో ఇద్దరు ఆస్ట్రేలియా ప్లేయర్లు ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. అయితే సన్రైజర్స్ కెప్టెన్గా ప్యాట్ కమిన్స్ పర్వాలేదు అనిపించిన   ఐపీఎల్ హిస్టరీలోనే భారీ ధర పలికిన  స్టార్క్ మాత్రం పూర్తిగా నిరాశపరిచాడు. 24.75 కోట్ల భారీ ధర పెట్టి కొనుగోలు చేస్తే కనీసం సాదాసీదా ఆటగాడిలాగా కూడా బౌలింగ్ చేయలేదు. ఏకంగా సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో 4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు ఈ భారీ ధర పలికిన ప్లేయర్. అతని ఐపీఎల్ కెరియర్ లోనే చెత్త గణాంకాలు నమోదు చేశాడు. అయితే కోట్లు పెట్టి కొనుక్కున్నది ఇలా పరుగులు సమర్పించేందుకేనా అని కోల్కతా జట్టు యాజమాన్యంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: