సచిన్ చెప్పిన ఆ ఒక్క మాట.. నేనెప్పటికీ మర్చిపోలేను : వరుణ్

praveen
ఇండియన్ క్రికెట్లో క్రికెట్ దేవుడిగా కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ గురించి భారత క్రికెట్ ప్రేక్షకులకే కాదు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు సైతం కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే గల్లి క్రికెట్ నుంచి ప్రపంచం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగిన ప్రస్థానం సచిన్ టెండూల్కర్ ది. సరిగ్గా చదువుకోకపోతే నువ్వేం చేయలేవు అని అందరూ తిడుతుంటే.. చదువు కాదు మనలో టాలెంట్ ఉండాలి అని నమ్మే ఎంతో మంది యువకులకు సచిన్ టెండూల్కర్ స్ఫూర్తి. ఇక క్రికెట్లోకి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగించాలి అని యువ ఆటగాళ్లు టార్గెట్ పెట్టుకునేలా అటు సచిన్ టెండూల్కర్ రికార్డులు క్రియేట్ చేశారు.

 దాదాపు రెండు దశాబ్దాలకు పైగానే భారత క్రికెట్లో సేవలు అందించి అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటి క్రికెటర్లకు సైతం బ్రేక్ చేసేందుకు సాధ్యం కాని రీతిలో ఎన్నో అద్భుతమైన రికార్డులను సచిన్ టెండూల్కర్ సాధించాడు అని చెప్పాలి. అయితే కేవలం సచిన్ క్రికెటర్గా ఎదగడమే కాదు తనతో పాటు ఇంకా ఎంతో మంది క్రికెటర్లకు చేయూతనిచ్చి వాళ్ళు కూడా ఎదిగేలా చేశాడు. అయితే ఇక్కడ ఒక క్రికెటర్ సచిన్ తన కెరియర్ ఎదుగుదలకు ఎలాంటి తోడ్పాటును అందించాడు అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు.

 సచిన్ చెప్పిన ఒక్క మాట తనలో కాన్ఫిడెన్స్ నింపింది అంటూ చెప్పుకొచ్చాడు ఫేస్ బౌలర్ వరుణ్ ఆరోన్. తన అరంగేట్రం టెస్టులోనే సచిన్ వల్లే పుంజుకోగలిగాను అంటూ ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నాడు. వాంకడేలో ఉన్న నా డెబ్యూ మ్యాచ్ అది. 21 ఓవర్లు వేసిన నాకు ఒక్క వికెట్ కూడా దక్కలేదు. దీంతో ఎంతగానో డీల పడిపోయాను. ఆ సమయంలో సచిన్ నన్ను చూసి నా దగ్గరికి వచ్చాడు. తాను వరల్డ్ కప్ ఆడటానికి 21 ఏళ్ళు ఎదురు చూశాను అంటూ సచిన్ నాతో అన్నాడు. దీంతో నాలో కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. ఇక ఆ తర్వాత ఓవర్ లోనే వికెట్ దక్కింది. మొత్తంగా ఆ ఇన్నింగ్స్ లో మరో రెండు వికెట్లను కూడా దక్కించుకోగలిగాను అంటూ వరుణ్ ఆరోన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: