ధోని హోమ్ గ్రౌండ్ లోనే.. కోహ్లీకి అసలైన పరీక్ష : హర్భజన్

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మొదలైంది అంటే చాలు భారత్లో క్రికెట్ పండగ మొదలవుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎన్నడూ లేని సరికొత్త ఎంటర్టైన్మెంట్ ఈ టోర్నీ ద్వారా పొందుతూ ఉంటారు. ఇక ఏకంగా అంతర్జాతీయ క్రికెట్లో ప్రత్యర్ధులుగా కొనసాగుతున్న ఆటగాళ్లు సహచరులుగా మారిపోయి ఒక జట్టు విజయం కోసం పోరాడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులు సహచరులుగా సహచరులు ప్రత్యర్ధులుగా మారిపోయే ఈ పోరు అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది.

 అయితే ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి  మొదలైంది. మార్చి 22వ తేదీ నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పటికే అన్ని జట్లు కూడా తమ టీం లో ఉన్న ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయి. అయితే ప్రస్తుతం ఆయా జట్లలో ఉన్న ఆటగాళ్లను దృష్టిలో పెట్టుకొని ఈసారి టైటిల్ విజేతగా నిలవబోయే టీం ఏది అనే విషయంపై కూడా ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూల మీద రివ్యూ ఇచ్చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అయితే మొదటి మ్యాచ్ లో భాగంగా అటు చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది.

 అయితే ఈసారి ఐపీఎల్ లో కోహ్లీ ప్రదర్శన ఎలా ఉంటుంది అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది అని చెప్పాలి. ఇక ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ హర్భజన్ సింగ్ మాట్లాడాడు. ఐపీఎల్ లో ఆర్సిబి తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లీకి చెన్నైలోని చపాక్ స్టేడియంలోనే అసలైన చాలెంజ్ ఎదురు కాబోతుంది అంటూ అభిప్రాయపడ్డాడు. ఆ మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ సగటు 30, స్ట్రైక్ రేట్111 ఉండడంతో హర్బజన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. చెపాక్ స్టేడియం పై ఓపెనర్ గా రాణించడం అంత సులువు కాదని.. మరింత శ్రమించాల్సిన అవసరం ఉంది అంటూ తెలిపాడు. ఆర్సిబి గెలవాలంటే 2016లో లాగానే కోహ్లీ బాగా ఆడాలి అంటూ హర్భజన్ చెప్పుకొచ్చాడు. అయితే చెపాక్ స్టేడియాని ధోని హోమ్ గ్రౌండ్ అని పిలుచుకుంటూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: