పంత్ కోలుకోక పోతే.. మేం చేయబోయేది అదే : పాంటింగ్

praveen
2024 ఐపీఎల్ సీజన్ కు సంబంధించిన హడావిడి మొదలైంది. ఈ క్రమంలోనే మార్చి 22వ తేదీ నుంచి కూడా ఇక ఈ టోర్నీ ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అన్ని జట్లు కూడా ఇక ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నయ్. జట్టులో ఉన్న ఆటగాళ్లను ఎలా ఉపయోగించుకోవాలి అనే విషయంపై పక్కా వ్యూహాలను రెడీ చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే అటు ఢిల్లీ జట్టు మాత్రం ఇంకా ఒక కన్ఫ్యూషన్ లో ఉంది. ఆ జట్టు కెప్టెన్ గా కొనసాగుతున్న రిషబ్ పంత్ ఈ ఐపిఎల్ సీజన్ నాటికి అందుబాటులో ఉంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.

 గత ఏడాది డిసెంబర్లో గాయం బారిన పడిన రిషబ్ పంత్.. దాదాపు ఏడాదికి పైగానే క్రికెట్ కు దూరంగా ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన పంత్ ఇక ఇప్పుడు నేషనల్ క్రికెట్ అకాడమీలో వైద్యుల ఆధ్వర్యంలో ప్రాక్టీస్ లో కొనసాగుతూ ఉన్నాడు. అయితే అతను పూర్తిస్థాయిలో కోలుకున్నాడా లేదా అనే విషయంపై మాత్రం ఇంకా ఒక క్లారిటీ రాలేదు. ఈ క్రమంలోనే మార్చి 22వ  తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ కు పంత్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంలో కూడా సందిగ్ధత  నెలకొంది. అయితే ఇదే విషయంపై ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఈసారి ఐపీఎల్ లో రిషబ్ పంత్ ఆడే అవకాశాలు ఉన్నాయని.. ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం భావిస్తోంది అంటూ రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఒకవేళ లీగ్ సమయానికి  పంత్ 100% ఫిట్నెస్ సాధించకపోతే అతనికి కెప్టెన్సీకి బదులుగా మరో రోల్ ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకుంటాము అంటూ చెప్పుకొచ్చాడు. పంత్ పూర్తి స్థాయి ఫిట్నెస్ సాధిస్తే కెప్టెన్సీ చేపడతాడని  చెప్పుకొచ్చాడు. అయితే ఒకవేళ పంత్ కోలుకోకపోతే ఢిల్లీ క్యాపిటల్స్ అతనికి అప్పగించబోయే కొత్త పాత్ర ఏంటి అన్నది కూడా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: