రిషబ్ పంత్ అనే.. ఒక క్రికెటర్ ఉండేవాడు.. రోహిత్ కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లాండ్ తో వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇప్పటికి నాలుగు టెస్ట్ మ్యాచ్లు ముగించుకుంది. ఇందులో మూడింటిలో విజయం సాధించిన టీమిండియా.. ఇక సిరీస్ ను కైవసం చేసుకుంది  కాగా నేడు ధర్మశాల వేదికగా నాలుగో టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ జట్టు ఎప్పటిలాగానే ఇక భారత్ తో జరుగుతున్న టెస్టులో బజ్ బాల్ అనే ఆట తీరుతోనే ఎటాకింగ్ గేమ్ ఆడుతుంది అని చెప్పాలి. అయితే టీమిండియా మాత్రం ఇక రెగ్యులర్ ఫార్మాట్లోనే ఆట తీరును కొనసాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఇక భారత జట్టులో ఛాన్సులు దక్కించుకున్న యువ ఆటగాళ్లు మాత్రం దూకుడైన ఆటతీరుతో భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా సర్ప్రైజ్ చేస్తున్నారు అని చెప్పాలి. మరి ముఖ్యంగా యశస్వి జైష్వాల్ వన్డే తరహా ఆట తీరుతో డబుల్ సెంచరీలతో చెలరేగిపోతున్నాడు.

 దీంతో జైస్ బాల్ ముందు బజ్ బాల్ మూగబోయింది అంటూ ఎంతోమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఇక అతని దూకుడు అయిన ఆట తీరుపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు యశస్వి జైష్వాల్ దూకుడైన ఆట తీరు క్రెడిట్ ని కూడా ఇక ఇంగ్లాండ్ జట్టు తీసుకోవాలని ప్రయత్నించింది. టెస్ట్ క్రికెట్లో జైస్వాల్ దూకుడైన ఆట విషయంలో తమకే క్రెడిట్ ఇవ్వాలి అంటూ ఇంగ్లాండ్ ఒపెనర్ బెన్ డకేట్ అభిప్రాయపడ్డాడు. బజ్ బాల్ కాన్సెప్ట్ ను చూసి ఆకర్షితుడు అయిన యశస్వి జైష్వాల్ ఇక ఇలాంటి ఆట తీరుని ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్లో కనబరిచాడు అంటూ వ్యాఖ్యానించాడు.

 అయితే జైష్వాల్  ఆట తీరుపై ఇలాంటి కామెంట్లను చూసిన రోహిత్ శర్మ ఇక కాస్త ఘాటుగానే కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి. ఇక చివరి టెస్ట్ మ్యాచ్ కి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మకు.. ఇదే విషయంపై ప్రశ్న ఎదురయింది. అయితే ఈ విషయంపై రోహిత్ శర్మ స్పందిస్తూ ఒకప్పుడు రిషబ్ పంత్ అనే ఒక క్రికెటర్ ఉండేవాడు. అతని ఆటను బహుశా ఇంగ్లాండ్ ప్లేయర్ బెల్ డకెట్ చూసి ఉండకపోవచ్చు అంటూ వ్యాకరించాడు రోహిత్ శర్మ. అంటే ప్రస్తుతం జైష్వాల్  ఆడినట్లుగానే ఒకప్పుడు రిషబ్ పంత్ కూడా టెస్టుల్లో దూకుడు అయిన ఆట తీరును కనబరిచాడు. అందుకే ఇక ఈ సందర్భంలో రిషబ్ పంతును గుర్తు చేశాడు రోహిత్ శర్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: