అతన్ని చూస్తే.. మరో అశ్విన్ పుట్టినట్లు అనిపించింది?

praveen
ఇండియన్ క్రికెట్లో సీనియర్స్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ కు అటు వరల్డ్ క్రికెట్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అశ్విన్ ను అందరూ తెలివైన స్పిన్నర్ అని అభివర్ణిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇక ఏ బ్యాట్స్మెన్ కి ఎక్కడ బంతి వేస్తే వికెట్ దక్కుతుంది అన్న విషయం అతనికి బాగా తెలుసు. అంతేకాదు క్రికెట్ రూల్స్ అన్నింటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ తన వ్యూహాలతో ఎప్పుడు ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ ఉంటాడు ఈ సీనియర్ ప్లేయర్.

 ఇక భారత జట్టు ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ ఆడిన కూడా అతనికి తప్పకుండా తుది జట్టులో చోటు దక్కుతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇప్పటికే టెస్ట్ ఫార్మాట్ లో ఎన్నో అరుదైన రికార్డులను కూడా అందుకున్నాడు రవిచంద్రన్ అశ్విన్. అందుకే ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఎవరైనా యువ ఆటగాడు స్పిన్ బౌలింగ్ లో మంచి ప్రదర్శన చేశాడు అంటే చాలు అతన్ని ఇక భారత సీనియర్ రవిచంద్రన్ అశ్విన్ తో పోల్చి చూడటం చేస్తూ ఉంటారు అందరూ క్రికెట్ విశ్లేషకులు. అయితే ఇక్కడ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకల్ వాన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ఏకంగా వరల్డ్ క్రికెట్ కు మరో రవిచంద్రన్ అశ్విన్ దొరికేశాడు అంటూ మైకల్ వాన్ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి.

 భారత్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్న ఇంగ్లాండ్ బౌలర్ షోయబ్ బషీర్ పై ఆ దేశ మాజీ క్రికెటర్ మైఖేల్ వాన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఇంగ్లాండ్ జట్టుకు వరల్డ్ క్లాస్ సూపర్ స్టార్ దొరికాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. రాంచి వేదికగా జరిగిన టెస్టులో 8 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థని షోయబ్ బషీర్ భయపెట్టేశాడు అంటూ చెప్పుకొచ్చాడు.  వరల్డ్ క్రికెట్లో మరో అశ్విన్ పుట్టుకొచ్చాడు అంటూ ప్రశంసలు వర్షం కురిపించాడు. కాగా రాంచి టెస్టులో ఓడిపోయినప్పటికీ ధర్మశాల వేదికగా జరగబోయే ఐదవ టెస్టులో మాత్రం అటు ఇంగ్లాండ్ జట్టు విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు మైకల్ వాన్. ఈ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 3-1 తేడాతో ఇప్పటికే ఇండియా జట్టు టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: