అనుకున్నదే జరిగింది.. ఆ ఇద్దరికీ బిసిసిఐ ఊహించని షాక్?

praveen
సాధారణంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎప్పుడు ఆటగాళ్ళ విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా సరే ఇక బీసీసీఐ రూల్స్ కి విరుద్ధంగా ప్రవర్తించి తోక జాడించాడు అంటే చాలు ఇక ఆ తోక కత్తిరించేందుకు ఎక్కడ వెనకడుగు వేయదు అన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎంతోమంది ప్లేయర్ల విషయంలో ఇది జరిగింది. ఏకంగా బిసిసిఐ ఆదేశాలను బేఖాతరు చేసిన ప్లేయర్లపై కఠిన చర్యలుతీసుకున్నారు ఇక బోర్డు పెద్దలు. ఇక ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది.

 ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతూ ఉన్నారు శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్లు. వారికి ప్రస్తుతం భారత జట్టులో వరుసగా అవకాశాలు అందుతూ ఉన్నాయి అని చెప్పాలి  అయితే గత కొంతకాలం నుంచి జట్టుకు దూరమైన ఇద్దరు ప్లేయర్లు దేశవాళీ క్రికెట్లో ఆడాలని కోచ్ ఆదేశాలు జారీ చేసిన బేకాతలు చేశారు. దేశవాళీలు ఆడితేనే మళ్లీ భారత జట్టులో చోటు దక్కుతుందని తెలిపిన వీరు వినిపించుకోలేదు. దీంతో ఈ ఇద్దరు క్రికెటర్ల పై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈ ఇద్దరు ప్లేయర్లను బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్టర్ నుంచి తొలగించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. ఇక అందరూ అనుకున్నదే జరిగింది  ఈ ఇద్దరు క్రికెటర్లకు బోర్డు పెద్దలు షాకిచ్చారు.

 ఇటీవల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కిన ప్లేయర్ల వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఎంతో మంది యువ ఆటగాళ్లకు కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది భారత జట్టు యాజమాన్యం. కానీ శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్లకు మాత్రం షాక్ ఇచ్చింది. వీరిద్దరిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించని సమయాల్లో దేశావాళి క్రికెట్ ఆడాలని తాజా ప్రకటనలో మరోసారి పేర్కొంది. బీసీసీఐ వీరితోపాటు దీపక్ చాహర్, దీపక్ హుడా, చాహాల్ కి కూడా మొండి చేయి చూపించింది బీసీసీఐ. వీరిని కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: