జైష్వాల్ మామూలోడు కాదు.. ఆ లెజెండ్ రికార్డుపై కన్నేసాడే?

praveen
యశస్వి జైస్వాల్.. తిప్పి కొడితే పాతికేళ్లు కూడా నిండని కుర్రాడు. కానీ ఇప్పుడు సీనియర్ బౌలర్లకు సైతం గుబులు పుట్టిస్తున్నాడు. మహా మహా బ్యాట్స్మెన్ అనే అవుట్ చేసిన అనుభవజ్ఞులకు సైతం చెమటలు పట్టిస్తున్నాడు. ఇతనికి బౌలింగ్ చేస్తే ఎక్కడ తమ ఖాతాలో చెత్త రికార్డులు చేరిపోతాయి అని అందరూ భయపడేలా చేస్తూ ఉన్నాడు. అతనికి ఉన్న అంతంత మాత్రం అంతర్జాతీయ క్రికెట్ అనుభవంతోనే ఎన్నో రికార్డుల కొల్లగొడుతున్నాడు. అతను బ్యాట్ పట్టుకొని బలిలోకి దిగాడు అంటే డబుల్ సెంచరీ చేసే వరకు అలసిపోడు అనే రేంజ్ లో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.

 నెమ్మదిగా ఎంతో ఓపికతో ఆడే టెస్ట్ ఫార్మాట్లో సైతం దూకుడు అయిన ఆట తీరుతో ఏకక ప్రత్యర్థులకి ముచ్చెమటలు పట్టించి.. మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు  ఇక అతను క్రీజులో నిలదొక్కుకున్నాడు అంటే జట్టుకు విజయాన్ని అందిస్తాడు అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా గట్టిగా నమ్మే విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు. ఒక కుర్ర ఆటగాడు గురించి ఇంత ఇంట్రడక్షన్ ఎందుకు అనుకుంటున్నారు కదా.. అతను ఆడిన తీరు చూస్తే ఎవరు కూడా ఇది అతిగా ఇంట్రడక్షన్ చేసినట్లు అనుకోరు. ఎందుకంటే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో అవకాశం దక్కించుకున్న యశస్వి జైస్వాల్ బ్యాటింగ్ విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు.

 వరుసగా రెండు డబుల్ సెంచరీలు చేసి టాక్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ గా మారిపోయాడు. అయితే ఇలా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ లో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్  ఇక ఇప్పుడు ఏకంగా లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ రికార్డు పైన కన్నేసాడు. ఇప్పటివరకు మూడు టెస్ట్ మ్యాచ్లలో రెండు డబుల్ సెంచరీలు కలుపుకొని 545 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ లో టాప్ స్కోరర్ గా ఉన్నాడు. అయితే ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగులు 774. 1971లో సునీల్ గవాస్కర్ ఈ రికార్డు సాధించాడు. అయితే ఈ ఆల్ టైం రికార్డును సాధించేందుకు యశస్వి జైష్వాల్ ఇంకా 230 పరుగులు చేయాలి. ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండడంతో అతను ఎంతో అలవోకగా ఈ రికార్డును బద్దలు కొట్టడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: