సొంత గడ్డపై తిరుగులేని టీమిండియా.. చరిత్ర సృష్టించిందిగా?

praveen
వరల్డ్ క్రికెట్లో పటిష్టమైన టీం గా కొనసాగుతున్న టీమిండియా సొంత గడ్డపై మరింత ప్రమాదకరమైన జట్టు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత పర్యటనకు వచ్చి ఏకంగా భారత జట్టును ఓడించడం అంటే అది అసాధ్యమని.. క్రికెట్ విశ్లేషకులు  కూడా చెబుతూ ఉంటారు. అయితే ఇప్పటివరకు ఎన్నో టీమ్స్ ఇలా భారత పర్యటనకు వచ్చి చివరికి టీమిండియా చేతిలో ఓడిపోయి నిరాశతో తిరుగు పయనం అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఇక భారత జట్టు సొంత గడ్డపై ఎంత పటిష్టంగా ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇటీవలే టెస్ట్ విజయం కూడా నిలిచింది అని చెప్పాలి. ప్రస్తుతం ఇంగ్లాండు టీం ఇండియా మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జరుగుతుంది.

 ఈ టెస్ట్ సిరీస్ కోసం ఏకంగా భారత పర్యటనకు వచ్చింది ఇంగ్లాండు. అయితే ఇప్పటికే రెండు టెస్ట్ మ్యాచ్ లు ముగిసాయి. అయితే ఇక రెండు జట్లు చెరో మ్యాచ్లో విజయం సాధించాయ్. అయితే ఇటీవల రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ కూడా హోరా హోరిగా జరిగింది. ఈ క్రమంలోనే భారత జట్టు పట్టు బిగించడంతో ఈ టెస్ట్ మ్యాచ్లో ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఇక భారీ విజయాన్ని అందుకోవడంతో టీమిండియా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి  ఏకంగా ఇంగ్లాండ్ జట్టుపై 434 పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది.

 సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో అటు పరుగుల పరంగా టీమ్ ఇండియాకు ఇదే అతిపెద్ద విజయం కావడం గమనార్హం. గతంలో న్యూజిలాండ్ పై సాధించిన 372 పరుగుల తేడాతో సాధించిన విజయమే  అత్యధిక పరుగుల తేడాతో విజయం గా ఉండేది. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్ ఫై ఏకంగా 434 పరుగుల తేడాతో  విజయం సాధించి చరిత్ర సృష్టించింది టీమ్ ఇండియా. ఇక ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా పై 337 పరుగులు, న్యూజిలాండ్ పై 321 పరుగులు, ఆస్ట్రేలియా పై 320 పరుగులు తేడాతో భారత్ టెస్ట్ ఫార్మాట్లో విజయం సాధించింది. అయితే ఇంగ్లాండ్ కు టెస్టుల్లో ఇదే రెండో బిగ్గెస్ట్ ఓటమి కావడం గమనార్హం. 1964 లో ఆస్ట్రేలియా చేతిలో 524 పరుగుల తేడాతో ఓడిపోయింది ఇంగ్లాండ్. ఇక ఆ తర్వాత ఇంత భారీ పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోవడం ఇదే మొదటిసారి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: