అలా చేయమని ఓ మాజీ క్రికెటర్ నాపై ఒత్తిడి చేశాడు.. నిజం బయటపెట్టిన హెచ్సీఏ కోచ్?

praveen
గత కొంతకాలం నుంచి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదో ఒక విషయంలో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న అజరుద్దీన్ ఆ పదవి కోల్పోవడం ఇక తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు అన్ని ఇక సంచలనంగా మారిపోయాయ్. అయితే ఇటీవల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కోచ్ గా ఉన్న వ్యక్తిని ఏకంగా నుంచి తొలగిస్తూ హెచ్సీఏ నిర్ణయం తీసుకుంది. ఏకంగా మహిళా ప్లేయర్ల  ఎదుట మద్యం సేవిస్తూ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడు అన్న ఆరోపణలతో అతనిపై ఇలాంటి చర్యలు తీసుకుంది హైదరాబాద్ క్రికెటర్ అసోసియేషన్.

 అంతేకాకుండా మహిళా క్రికెటర్లను వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు కూడా వచ్చాయి.  అయితే ఇలా తనను ఏకంగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్ పదవి నుంచి తొలగించడం పై హెడ్ కోచ్ జై సింహ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలోనే షాకింగ్ నిజం పెట్టాడు. ఈ క్రమంలోనే జై సింహా చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి. తనపై వచ్చిన ఆరోపణలు అన్నీ కూడా అవాస్తవం అంటూ పేర్కొన్నాడు జైసింహ. ఏకంగా ఓ మాజీ క్రికెటర్ కూతురిని జట్టులో చేర్చుకోలేదు అన్న కారణంతోనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.

 ఈనెల 1వ తేదీన తన కూతురిని హైదరాబాద్ క్రికెట్ జట్టులో చేర్చుకోవాలి అంటూ ఒక మాజీ క్రికెటర్ తనపై ఒత్తిడి చేశాడు. అందుకు నేను ఒప్పుకోలేదు. అందుకే నన్ను టార్గెట్ చేసి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అంటూ జైసింహ ఆరోపించాడు. మహిళల క్రికెట్ కోసం తాను ఎంతగానో కృషి చేశాను అంటూ తెలిపాడు. తాను ఎప్పుడు కూడా మహిళా క్రికెటర్ల ఎదుట మద్యం సేవించలేదు అంటూ స్పష్టం చేశాడు. అయితే జరిగిన ఘటనపై కనీసం తన వివరణ కూడా తీసుకోకుండా ఎలా సస్పెన్ చేస్తారు అంటు ప్రశ్నించాడు జై సింహ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: