అశ్విన్ ఇంటికి వెళ్లడానికి.. అసలు కారణం అదేనట?

praveen
గత కొంతకాలం నుంచి టీమిండియా జట్టుకు కీలక ప్లేయర్లు అందరూ కూడా దూరమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమవుతుంటే ఇంకొంతమంది ప్లేయర్లు వ్యక్తిగత కారణాలతో ఇక జట్టుకు అందుబాటులో ఉండడం లేదు. ఇప్పటికే విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్ వ్యక్తిగత కారణాలవల్ల ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కి పూర్తిగా దూరమైపోయాడు అన్న విషయం తెలిసిందే   ఇక కోహ్లీ లేకుండానే ప్రస్తుతం వరుసగా టెస్ట్ మ్యాచ్లు ఆడుతుంది టీమ్ ఇండియా  ప్రస్తుతం రాజ్కోట్ వేదికగా మూడవ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది అని చెప్పాలి.

 అయితే ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా భారత జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతూ ఉన్నాడు రవిచంద్రన్ అశ్విన్. మొదటి రెండు మ్యాచ్లలో తన ప్రదర్శనతో ఆకట్టుకున్న ఈ సీనియర్ ప్లేయర్.  మూడో టెస్ట్ మ్యాచ్లో కూడా మంచి ప్రదర్శన చేశాడు. ఇక కేవలం బౌలింగ్లో మాత్రమే కాదు బ్యాటింగ్ లోను పరవాలేదు అనిపించాడు. అంతేకాకుండా ఏకంగా మూడో టెస్ట్ మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా టెస్ట్ ఫార్మాట్లో 500 వికెట్ల మైలురాయిని కూడా అందుకున్నాడు అశ్విన్. అయితే ఇక ఈ సీనియర్ ప్లేయర్ కూడా  టీమ్ ఇండియాకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో జట్టు నుంచి తప్పుకున్నాడు అని చెప్పాలి.

 అయితే మూడు టెస్టుల పాటు ఇక జట్టులో కొనసాగిన అశ్విన్ ఇంత అత్యవసరంగా ఎందుకు జట్టు నుంచి తప్పుకున్నాడు అన్నది మాత్రం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు. అయితే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల ఇక అశ్విన్ అత్యవసరంగా తప్పుకోవడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. అశ్విన్ తల్లి వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆమెతో ఉండేందుకు ఆయన అత్యవసరంగా ఇంటికి వెళ్లారు అంటూ చెప్పుకొచ్చాడు రాజీవ్ శుక్ల. ఈ క్రమంలోనే అతను మరో మూడు రోజులపాటు ఇక జట్టుకు అందుబాటులో ఉండడు అన్న విషయం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: