పాక్ క్రికెటర్ కు బిగ్ షాక్.. బ్యాన్ చేసినంత పనయ్యిందిగా?

praveen
గత కొంతకాలం నుంచి పాకిస్తాన్ క్రికెట్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో పాకిస్తాన్ జట్టు ఘోరంగా విఫలం కావడంతో ఆ జట్టు తీరుపై తీవ్ర స్థాయిల విమర్శలు వచ్చాయ్. అయితే జట్టు సెలక్షన్ విషయంలో పక్షపాతంతో వ్యవహరించడం కారణంగానే పాకిస్తాన్ ఇలా వరల్డ్ కప్ లో వైఫల్యం చెందింది అంటూ క్రికెట్ విశ్లేషకులు అందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పాకిస్తాన్ జట్టు కనీసం సెమి ఫైనల్ కూడా చేరకుండా వరల్డ్ కప్ టోర్ని నుంచి నిష్క్రమించి స్వదేశానికి చేరిందో లేదో ఇక అంతలోనే ఏకంగా పాకిస్తాన్ జట్టు యొక్క కోచింగ్ సిబ్బంది అందరిని కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.

 ఇక కేవలం స్వదేశీ మాజీ ప్లేయర్లను మాత్రమే కోచ్ లుగా నియమించింది. ఆ తర్వాత కాలంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా ఉన్న అష్రాఫ్ సైతం ఇక ఇలా తన పదవికి రాజీనామా చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ ను బాగు చేయడం తన వళ్ళు కాదు అంటూ తేల్చి చెప్పేశాడు. అయితే కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టుకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఒకవైపు స్వదేశంలో ఇంకోవైపు విదేశీ పర్యటనల్లో కూడా వరుసగా విఫలమవుతూ దారుణమైన ప్రదర్శన చేస్తూ వస్తుంది పాకిస్తాన్ జట్టు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుకు ఆడటం కంటే.. ఇక ఇతర దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే టి20 లీగ్లలో ఆడటానికి ఒక ఆ జట్టు ఆటగాళ్లు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు అని చెప్పాలి.

 ఇలాంటి పరిస్థితుల మధ్య పాకిస్తాన్ జట్టులో స్టార్ బౌలర్గా కొనసాగుతున్న హరీష్ రావుఫ్ కి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు బిగ్ షాక్ ఇచ్చింది. ఏకంగా అతడిని సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా జరిగే లీగ్ క్రికెట్లో అతను పాల్గొనడానికి ఎన్ఓసి ఇచ్చేందుకు కూడా నిరాకరించింది అని చెప్పాలి. అయితే విదేశీ లీగ్లలో ఆడటానికి సిద్ధంగా ఉన్న హరీష్ రౌఫ్ అటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ఆడటానికి నిరాకరించడంతోనే ఇక అతనిపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇలాంటి చర్యలు తీసుకుంది అన్నది తెలుస్తుంది. ఇలా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించడమే కాదు ఇక ఇతర దేశాల లీగ్లలో ఆడెందుకు ఎన్ఓసి ఇవ్వడానికి నిరాకరించి ఒక రకంగా బ్యాన్ చేసినంత పని చేసింది పాక్ బోర్డు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: