ఈసారి వరల్డ్ కప్ గెలిచేది మా టీమే.. జై షా కీలక వ్యాఖ్యలు?

praveen
ప్రతిసారి వరల్డ్ కప్ టోర్నీలలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగే టీమిండియా.. ఇక 140 కోట్ల క్రికెట్ ప్రేక్షకులు అందరిని కూడా తీవ్రంగా నిరాశ పరుస్తూనే వస్తుంది అన్న విషయం తెలిసిందే. గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా తప్పకుండా విజయం సాధిస్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో ఫైనల్ లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. కనీసం సౌత్ ఆఫ్రికా వేదికగా జరిగిన అండర్ 19 వరల్డ్ కప్ లో అయినా యంగ్ టీమ్ ఇండియా విశ్వవిజేతగా నిలుస్తుంది అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో అదే ఆస్ట్రేలియాను మరోసారి దెబ్బ కొట్టింది. అయితే ఈ రెండు ఓటములకు బదులు తీర్చుకోవాలి అంటే జూన్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ ను టీమిండియా తప్పకుండా గెలిచి తీరాల్సిందే.

 అయితే భారత్ టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతూ ఉండగా.. మిగతా టీమ్స్ కూడా అటు వరల్డ్ కప్ టైటిల్ పై కన్నేసాయి అని చెప్పాలి.  గత ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్కప్ లో చిన్న టీమ్స్ ప్రదర్శన చూసిన తర్వాత ఏ టీమ్ ని తక్కువ అంచనా వేయడానికి లేదు అని క్రికెట్ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి టీమిండియాని టి20 వరల్డ్ కప్ లో విజేతగా నిలుస్తుంది అని కొంతమంది విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై బీసీసీఐ సెక్రటరీ జై షా కూడా స్పందించాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కాస్త సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయాయి.

 ఇటీవలే ఒక కార్యక్రమంలో పాల్గొన్న జై షా 2023 వరల్డ్ కప్ ఓటమిపై కూడా స్పందించాడు. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా త్వరలో జరగబోయే టి20 వరల్డ్ కప్ ను తప్పకుండా గెలుచుకుంటుంది అంటూ జై షా చెప్పుకొచ్చాడు. అందులో ఎలాంటి సందేహం లేదు అంటూ తెలిపాడు. టి20 ఫార్మాట్లో రాణించగల ఆటగాళ్లు జట్టులో చాలామంది ఉన్నారు. అయితే ఇటీవలే ముగిసిన వరల్డ్ కప్ లో టీం ఇండియా ఫైనల్ లో ఓడిపోయినప్పటికీ.. తమ ఆట తీరుతో మాత్రం అభిమానుల మనసులు గెలుచుకుంది అంటూ జై షా వ్యాఖ్యానించాడు. పది మ్యాచ్ లలో నెగ్గి కప్పు గెలవనప్పటికీ.. వారు హీరోలే అంటూ జైషా ప్రశంసలు కురిపించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: