తగ్గేదేలే అంటున్న కుర్రాళ్ళు.. ఆరు జట్లను మడత పెట్టేశారు?

praveen
జూన్ 1వ తేదీ నుంచి టీ20 వరల్డ్ కప్ జరుగుతూ ఉండగా.. ఈ వరల్డ్ కప్  కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ వరల్డ్ కప్ ప్రారంభానికి కొన్ని నెలల సమయం ఉండగా ఇక ఇప్పుడు మరో వరల్డ్ కప్ ప్రేక్షకులను అలరిస్తుంది. అదే సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్. వన్డే ఫార్మాట్లో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ టోర్నీలో కుర్రాళ్ళు కుమ్మేస్తూ ఉన్నారు. అన్ని దేశాలకు చెందిన ఆటగాళ్లు కూడా అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు అని చెప్పాలి   ఇక యంగ్ టీమ్ ఇండియా ప్రదర్శన గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.

 డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన భారత జట్టు.. అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటుంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడిన టీమిండియా.. ఆరింటిలో కూడా విజయం సాధించి ఓటమి ఎరుగని జట్టుగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఇక ఈ ఆరు విజయాలలో మూడు మ్యాచ్లలో 200 కు పైగా పరుగుల తేడాతో విజయం సాధించి.. టీమ్ ఇండియా అండర్ 19 వరల్డ్ కప్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించింది అన్న విషయం తెలిసిందే. అయితే వరల్డ్ కప్ టోర్నీ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతున్నారు టీమిండియా ప్లేయర్లు. ఇక ఇటీవల సెమీఫైనల్ లో అడుగుపెట్టి సత్తా చాటిన అండర్ 19 టీమ్ ఇండియా.  ఇక సెమి ఫైనల్ సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో కూడా ఘనవిజయాన్ని అందుకుంది.

 ఈ క్రమంలోనే ఫైనల్ లో అడుగుపెట్టి మరోసారి టైటిల్ గెలుచుకునేందుకు సిద్ధమైంది టీమిండియా. ఈ క్రమంలోనే వరుసగా ఐదో సారి ఫైనల్ కు దూసుకు వెళ్ళింది అని చెప్పాలి. అయితే ఇప్పుడు వరకు ఏకంగా నాలుగు సార్లు వరుసగా టైటిల్స్ గెలుస్తూ వచ్చిన భారత జట్టు ఇక ఇప్పుడు ఐదోసారి కూడా టైటిల్ ని నెగ్గెందుకు సిద్ధంగా ఉంది. భారత జోరు చూస్తూ ఉంటే ఎంతో అలవకగా వరల్డ్ కప్ విజేతగా నిలవడం ఖాయం అనేది తెలుస్తుంది  కాగా ఈ నెల 8వ తేదీన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య జరిగే రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో విజేతతో ఇక ఫైనల్లో టీమ్ ఇండియాతో తలబడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: