బాబర్ నీ పెళ్ళెప్పుడు.. మహమ్మద్ రిజ్వాన్ కొంటె ప్రశ్న?

praveen
సాధారణంగా క్రికెటర్లకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ క్రమంలోనే క్రికెటర్లకు సంబంధించిన విషయం ఏదైనా ఇంటర్నెట్ లోకి వచ్చింది అంటే చాలా అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే క్రికెటర్లకు సంబంధించిన ప్రేమాయణాలు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు అభిమానులు మరింత ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే సాధారణంగా స్టార్ క్రికెటర్లు సోషల్ మీడియాలో సంభాషించుకోవడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాం.

 కానీ కొన్ని కొన్ని సార్లు స్టార్ క్రికెటర్లు ఏకంగా పర్సనల్ విషయాల గురించి సోషల్ మీడియాలో సంభాషించుకోవడం చేస్తుంటారు. ఇక ఇలాంటివి ఇంటర్నెట్ లో వైరల్ గా మారిపోతూ ఉంటాయి అని చెప్పాలి. పాకిస్తాన్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న మాజీ కెప్టెన్ బాబర్, మహమ్మద్ రిజ్వాన్లు కూడా ఇలాగే సోషల్ మీడియాలో చేసిన ఒక ఫన్నీ సంభాషణ కాస్త అభిమానులు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. కాగా బాబర్ ఆజామ్, మహమ్మద్ రిజ్వాన్లు ఒకప్పుడు ఓపెనింగ్ జోడీగా పాకిస్తాన్ జట్టుకు ఎంత అద్భుతమైన ఆరంభాలు ఇచ్చారో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ఇద్దరు కూడా అత్యుత్తమ ఆటగాళ్లు మాత్రమే కాదు బెస్ట్ ఫ్రెండ్స్ కావడం గమనార్హం.

 అయితే ఇద్దరు పాకిస్తాన్ స్టార్ ప్లేయర్లు ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర సంభాషణ చేసుకున్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ రిజ్వాన్.. సార్ మీ పెళ్లి ఎప్పుడు అంటూ బాబర్ సరదాగా ప్రశ్నించాడు. అయితే దీనిపై స్పందించిన బాబర్ అజం ఈ ప్రశ్న అడుగుతావని నాకు తెలుసు నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సమాధానం చెబుతాను అంటూ రిప్లై ఇచ్చాడు. కాగా వీరి సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇకపోతే వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కొన్ని రోజుల క్రితమే బాబర్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: