పాపం.. వార్నర్ ను మరిపించలేక.. తంటాలు పడుతున్న స్మిత్?

praveen
ఆస్ట్రేలియాలో స్టార్ ఓపెనర్ గా ప్రస్థానం కొనసాగించిన డేవిడ్ వార్నర్ ఇటీవల తన టెస్ట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. అయితే డేవిడ్ వార్నర్ ఇక అద్భుతమైన ఓపెనర్ గా ఎన్నోసార్లు అటు ఆస్ట్రేలియా జట్టుకు శుభారాంబాలు అందించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ లతో  ఆకట్టుకున్నాడు. అయితే డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత ఆస్ట్రేలియా జట్టులో వార్నర్ ఓపెనర్ పాత్రను తీసుకోబోయేది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే ఎవరైనా యువ ఆటగాడికి ఛాన్స్ ఇస్తారేమో అని అందరూ అనుకున్నారు. కానీ జట్టులో అనుభవజ్ఞుడిగా కొనసాగుతున్న స్మిత్ కి ఓపెనర్ బాధ్యతలు అప్పగించారు. అయితే టెస్ట్ క్రికెట్లో లెజెండ్ గా గుర్తింపును సంపాదించుకుని ఇప్పటివరకు ఎన్నో కిర్రాక్ ఇన్నింగ్స్ లు ఆడిన స్టీవ్ స్మిత్ అటు ఓపెనర్ గా మాత్రం అస్సలు ఇమడలేకపోతున్నారు. ఇక వార్నర్ లాగా ఓపెనర్ గా పెద్ద ఇన్నింగ్స్ లను నిర్మించడం ఎంత కష్టమో ఇప్పుడు స్మిత్ ఆట తీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఇప్పటివరకు అతను మూడు టెస్ట్ మ్యాచ్లు ఆడగా ఏకంగా రెండుసార్లు డక్ అవుట్ అయ్యాడు. ఇక ఈ మూడు టెస్ట్ మ్యాచ్లలో అతని అత్యధిక స్కోరు కేవలం 12 పరుగులు మాత్రమే కావడం గమనార్హం.

 ఇప్పుడు వరకు స్మిత్ మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ కి వచ్చేవాడు. నాలుగో స్థానంలో వచ్చేసరికి అప్పటికే బంతి పాత బడేది. ఇక అప్పుడు లబుషేన్ తో  కలిసి హిట్టింగ్ చేసేవాడు. స్మిత్ సెంచరీల మీద సెంచరీలు కొట్టేవాడు. ఇప్పుడు వరకు ఏకంగా 32 శతకాలు సాధించాడు. కానీ వార్నర్ వీడ్కోలతో ఓపెనర్ గా అతనికి ఛాన్స్ రాక ఎక్కడ ఆకట్టుకోలేకపోతున్నాడు. దీంతో వార్నర్ స్థానాన్ని భర్తీ చేయడం క్రికెట్ ఆస్ట్రేలియా కు పెద్ద తలనొప్పి గానే మారిపోయింది. స్మిత్ లాంటి అనుభవజ్ఞుడే ఇలా తేలిపోతే ఇంకెవరిని ఓపెనర్ గా నియమించాలో తెలియక కన్ఫ్యూషన్ లో పడిపోతున్నారు సెలెక్టర్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: