వారెవ్వా.. స్మృతి మందానకు అరుదైన అవార్డు?

praveen
మనదేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో రకాల క్రీడలు ఆడే ఆటగాళ్ళు ఉన్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం క్రికెట్ ప్లేయర్లని ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. ఇక క్రికెట్ మ్యాచ్ లనే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే క్రికెట్ మ్యాచ్ వస్తుంది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నాయి సరే పక్కన పెట్టేసి టీవీలకు అతుక్కుపోతూ ఉంటారు అని చెప్పాలి. కొంతమంది క్రికెట్ ప్రేక్షకులు అయితే కాస్త ఖర్చు అయిన పర్వాలేదు అనుకుని ఏకంగా మైదానంలో నేరుగా మ్యాచ్ చూడటానికి వెళ్తూ ఉంటారు.

 అయితే ఇండియాలో క్రికెట్ కి క్రేజ్ ఉంది. కానీ కేవలం మెన్స్ క్రికెట్ కి మాత్రమే క్రేజ్ ఉంది అన్న విధంగా మొన్నటి వరకు పరిస్థితులు ఉండేవి. కానీ ఇటీవల కాలంలో బీసీసీఐ మహిళా క్రికెట్ ను కూడా ప్రోత్సహించడంతో పురుష క్రికెటర్లతో సమానంగానే మహిళా క్రికెటర్లు కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇలా ఏకంగా మెన్స్ క్రికెట్ తో సమానంగా క్రేజ్ సంపాదించుకున్న ఉమెన్ క్రికెటర్లలో స్మృతి మందాన కూడా ఒకరు అని చెప్పాలి  ప్రస్తుతం టీమిండియా మహిళా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నారు ఆమె.

 సాదరణంగా క్రికెటర్లు తమ ఆట తీరుతో అభిమానులను సంపాదించుకుంటారు. అయితే స్మృతి మందాన ఆట తీరుతోనే కాదు అందం అభినయంతో కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఎంతోమంది కుర్ర కారు మతి పోగొట్టింది. అయితే స్మృతి మందాన ఇటీవల బిసిసిఐ ప్రకటించిన అవార్డులలో ఎన్నో అవార్తులను సొంతం చేసుకుంది అని చెప్పాలి. బెస్ట్ ఉమెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ గా వరుసగా రెండుసార్లు నిలిచింది స్మృతి మందన 2020 - 21, 2021-22 సీజన్ లలో అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు బీసీసీ ఆమెకు అవార్డును బహూకరించింది. టీమిండియా ఆల్ రౌండర్ దీప్తి శర్మ కూడా ఇలా  రెండు సీజన్ల పాటు ఈ అవార్డును అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: