టి20 క్రికెట్లో.. ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ - రింకు జోడి?

praveen
ప్రస్తుతం వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉన్న భారత జట్టు ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ తో టి20 సిరీస్ ని కూడా ముగించుకుంది. ఈ టి20 సిరీస్ లో 3-0 క్లీన్ స్వీట్ చేసింది. అయితే చివరి t20 మ్యాచ్ లో అటు టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెంచరీ మరోవైపు ఇంకా టీమిండియా బ్యాట్స్మెన్ రింగు సింగ్ ఇక తన మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇద్దరు ఆటగాళ్లు కూడా ఐదో వికెట్ కి ఏకంగా 190 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు.

 ఈ క్రమంలోనే భారత జట్టు ఎంతో అలవోకగా భారీ స్కోరు చేయగలిగింది అని చెప్పాలి. అయితే ఇక సూపర్ సెంచరీ ద్వారా రోహిత్ శర్మ ఎన్నో అరుదైన రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఇక రింకు సింగ్ తో కలిసి రోహిత్ శర్మ నిర్మించిన భాగస్వామ్యంతో కూడా ఒక అరుదైన రికార్డింగ్ ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి. అంతర్జాతీయ టి20 లను రింకు రోహిత్ జోడి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఏకంగా ఐదో వికెట్ కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడిగా సరికొత్త చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.

 ఇటీవలే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మూడో టి20 మ్యాచ్ లో అటు రోహిత్ శర్మ మొదటి నుంచి ఎంతో దూకుడుగా  ఆడుతూ అదరగొట్టాడు. అయితే ఇక కీలకమైన బ్యాట్స్మెన్లు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన రింకు సింగ్.. రోహిత్ శర్మతో కలిసి ఎంతో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు అని చెప్పాలి. ఈ ఇద్దరు జోడి 190 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. దీంతో ఈ రికార్డు సాధించారు. అయితే అంతకుముందు ఈ రికార్డు నేపాల్ ప్లేయర్లు దీపేంద్ర కుషాల్ పేరిట ఉండేది. ఇద్దరి జోడి ఐదో వికెట్ కి 145 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇప్పుడు ఈ రికార్డుని రోహిత్- రింకు జోడి బద్దలు కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: