కోహ్లీ మైకేల్ జాక్సన్ స్టెప్.. వీడియో వైరల్.. మీరు చూశారా?

praveen
టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది క్రికెట్ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. అంతేకాదు వరల్డ్ క్రికెట్లో రికార్డుల రారాజుగా కూడా ప్రస్థానం కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఇక కోహ్లీతో ఆట అంటే చాలు ప్రత్యర్ధులందరూ కూడా భయపడిపోయే విధంగా కోహ్లీ బ్యాటింగ్ కొనసాగుతూ ఉంటుంది. ఎన్ని పరుగులు చేసిన ఇంకా దాహం తీరలేదు అన్నట్లుగానే ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

 అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీ అస్సలు బావొద్గాలను అదుపులో ఉంచుకోలేడు. తనకు ఏది అనిపిస్తే అది చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఎన్నోసార్లు మైదానంలో అగ్రసీవ్ గా రియాక్ట్ అయ్యి ప్రత్యర్ధులతో  గొడవ పడిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఆవేశమైన సంతోషమైన కూడా మైదానంలో చూపించడంలో విరాట్ కోహ్లీ తర్వాతే ఇంకెవరైనా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని సార్లు. ఎందుకంటే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో అగ్రే సీవ్ గా కనిపించే విరాట్ కోహ్లీ మ్యాచ్ పూర్తయిన తర్వాత మాత్రం చిల్లపిల్లాడి లాగా మారిపోతూ ఉంటాడు. నిజంగా ఇతను స్టార్ క్రికెటరేనా అని అనిపించేంతలా ఏకంగా చిలిపి పనులు చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ.

 అయితే ఇటీవలే అటు ఆఫ్ఘనిస్తాన్ పై మూడో టి20 మ్యాచ్ గెలిచిన తర్వాత సెలబ్రేషన్స్ చేసుకున్నారు టీమిండియా ప్లేయర్లు. ఈ క్రమంలోనే ఇక విరాట్ కోహ్లీ లోని చిన్నపిల్లాడు మరోసారి బయటికి వచ్చాడు. కోహ్లీ వెరైటీ డాన్స్ మూమెంట్తో అలరించాడు.  దివంగత పాప్ సింగర్ డాన్సర్ అయిన మైకేల్ జాక్సన్ స్లైడ్ స్టెప్ చేశాడు. ఏకంగా మైదానంలో దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి మైకల్ జాక్సన్ లాగా ఒక్కసారిగా మైదానంలో చేరాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. అగ్రే సేవ్ గా ఉండాలన్నా చిలిపి పనులు చేయాలన్న కోహ్లీ తర్వాతే ఇంకెవరైనా అంటూ ఎంతో మంది అభిమానులు కామెంట్లు చేస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: