టి20 సిరీస్ లో సెలెక్టర్లు పక్కన పెట్టడంపై.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడో తెలుసా?

praveen
ఇటీవల కాలంలో భారత క్రికెట్లో పోటీ ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తెర మీదికి వస్తూనే ఉంది. ఎంతో మంది యువ ఆటగాళ్లు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతూనే ఉన్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక సెలక్టర్లు చూపును ఆకర్షిస్తూ ఏకంగా ఇక టీమిండియాలోకి కూడా వస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. దీంతో అటు సీనియర్ క్రికెటర్ల కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. అప్పటికే మంచి ప్రదర్శన చేసి తామేంటో నిరూపించుకున్న వారూ సైతం ఎప్పటికప్పుడు సరికొత్తగా ఫామ్ ను కొనసాగిస్తూ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే ఎవరైనా సీనియర్ క్రికెటర్ రెండు మూడు మ్యాచ్లలో పేలవ ప్రదర్శన చేశాడు అంటే చాలు అతన్ని సెలెక్టర్లు నిర్మొహమాటంగా పక్కనపెట్టి అతని స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తున్నారు. ఇలా భారత జట్టులో ఎప్పుడూ ఎవరికి స్థానం దక్కుతుంది అన్నది కూడా ఊహకందని విధంగానే మారిపోయింది. ఇక ఇటీవల టీం ఇండియాలో ఉన్న తీవ్రమైన పోటీ నేపథ్యంలో ఆటగాళ్ళు అందరూ ఎప్పుడూ అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి.

 అయితే భారత జట్టులో స్థానం కోసం ప్లేయర్ల మధ్య ఉన్న పోటీపై ఇక భారత స్టార్ ప్లేయర్స్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టులో స్థానం కోసం ప్లేయర్ల మధ్య పోటీ ఉండడం ఎంతో మంచిదే అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్. అప్పుడే ఇక ప్రతి ఆటగాడు మరిన్ని సవాళ్లను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది. ఇక అంతేకాదు ఆటని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకునేందుకు దోహదపడుతుంది అంటూ తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్తో టి20 జట్టులో తనకు చోటు దక్కకపోవడం పై కూడా స్పందించాడు. అది తన కంట్రోల్లో లేదని.. అందుకే దాని గురించి ఆలోచించడం లేదు అంటూ తెలిపాడు. పరిస్థితులతో సంబంధం లేకుండా అటాకింగ్ గేమ్ ఆడాలి అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు శ్రేయస్ అయ్యర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: