డకౌట్.. అయినా ధోని రికార్డు సమం చేసిన రోహిత్?

praveen
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత పొట్టి ఫార్మాట్లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. 2024 t20 వరల్డ్ కప్ తర్వాత ఈ ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయిన రోహిత్ శర్మ.. అటు2024 t20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఈ ఫార్మాట్ లోకి వచ్చేసాడు. ఇక సారధ్య బాధ్యతలను చేపట్టి జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే చాలా ఏళ్ల తర్వాత పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ చేపట్టిన రోహిత్ శర్మ ఇక తొలి అడుగులోనే అటు జట్టుకు సిరీస్ అందించగలిగాడు అని చెప్పాలి.

 వ్యక్తిగత ప్రదర్శన విషయంలో ఎలా ఉన్నప్పటికీ కెప్టెన్ గా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వరుసగా రెండు మ్యాచ్లలో ఆఫ్గనిస్తాన్ జట్టును ఓడించి ఇక సిరీస్ ను కైవసం చేసుకుంది టీమ్ ఇండియా. అయితే ఇక ఇటీవల రోహిత్ శర్మ ఏకంగా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును కూడా సమం చేయగలిగాడు. టి20 ఫార్మాట్లో మహేంద్ర సింగ్ ధోని జట్టును ఎంత సమర్థవంతంగా ముందుకు నడిపించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫార్మాట్లో కెప్టెన్ గా భారత జట్టుకు ఎక్కువ విజయాలు అందించిన ప్లేయర్ గా కూడా ఉన్నాడు.

 ఏకంగా ధోని కెప్టెన్గా 41 విజయాలను టి20 ఫార్మాట్లు అందించాడు. అయితే ఇటీవలే రోహిత్ శర్మ ఈ రికార్డును సమం చేశాడు. ఏకంగా ఇటీవల జరిగిన రెండో మ్యాచ్లో విజయంతో కెప్టెన్ గా రోహిత్ శర్మ టి20 ఫార్మాట్లో భారత జట్టుకు 41 విజయాలను అందించాడు. అయితే మహేంద్ర సింగ్ ధోని 72 మ్యాచ్లలో ఈ ఘనతను సాధిస్తే.. రోహిత్ శర్మ కేవలం 53 మ్యాచ్లలోనే ఈ ఘనతను సాధించడం గమనార్హం. అదే సమయంలో అత్యధిక టి20 సిరీస్ లు గెలిచిన భారత కెప్టెన్ గా కూడా రోహిత్ రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు రోహిత్ కెప్టెన్గా 12 t20 సిరీస్ లు గెలిచాడు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: