రెండు మ్యాచ్లలో డకౌట్.. అయినా ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్?

praveen
టీమిండియా కెప్టెన్ హిట్ మాన్ రోహిత్ శర్మ చాలాకాలం తర్వాత మళ్లీ టి20 ఫార్మాట్ లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత ఇక పొట్టి ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు. ఈ క్రమంలోనే కెప్టెన్సీ చేపట్టి జట్టును ముందుకు నడిపిస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. ఆఫ్గనిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్లో టీమిండియా అదరగొడుతుంది. రెండు మ్యాచ్లలో కూడా  భారత జట్టుకు విజయాన్ని అందించగలిగాడు రోహిత్.. ఇక ఎంతో మంది యువ ఆటగాళ్ళు కూడా అద్భుతమైన ప్రదర్శన చేస్తూ ఆకట్టుకుంటున్నారు అని చెప్పాలి.

 అయితే దాదాపు 14 నెలల గ్యాప్ తర్వాత అటు పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన రోహిత్  అదరగొడతాడని అభిమానులు అందరూ కూడా భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఏకంగా సెంచరీ చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు అని నమ్మారు. కానీ ఊహించనీ రీతిలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్లలో కూడా రోహిత్ శర్మ డకౌట్ గా వెనుతిరిగాడు అన్న విషయం తెలిసిందే. మొదటి మ్యాచ్ లో పొరపాటున ఇక గిల్ కారణంగా రన్ అవుట్ రూపంలో డకౌట్ అయిన రోహిత్ శర్మ అటు రెండవ మ్యాచ్ లో మాత్రం ఇక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పరుగుల  ఖాతా తెరవకుండానే  పెవిలియన్ చేరాడు.

 అయితే రోహిత్ ప్రదర్శన పై అందరూ కూడా షాక్ లో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ఇలా రెండు మ్యాచ్లలో కూడా డక్ అవుట్ అయినప్పటికీ రోహిత్ శర్మ మాత్రం ఒక ప్రపంచ రికార్డును సృష్టించాడు. అంతర్జాతీయ టి20లలో 150 మ్యాచ్ లు ఆడిన తొలి ప్లేయర్గా నిలిచాడు రోహిత్ శర్మ. ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ ద్వారా ఈ ఘనతను అందుకున్నాడు అని చెప్పాలి. అతని తర్వాత ఐర్లాండ్ ప్లేయర్లు స్టెర్లింగ్ 134, డాక్రెల్ 134 మ్యాచులు ఆడి వరుసగా రెండు మూడు స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి. రోహిత్ శర్మ తర్వాత టీమిండియాలో మరో సీనియర్ ప్లేయర్గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ 116 మ్యాచ్లు ఆడి ఇక అత్యధిక మ్యాచ్ లు ఆడిన భారత ప్లేయర్లలో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: