రోహిత్ కెప్టెన్సీ పై.. యువరాజ్ సింగ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్?

praveen
ప్రస్తుతం భారత జట్టును మూడు ఫార్మాట్లకు కూడా సారధిగా ముందుకు నడిపిస్తూ అదరగొడుతున్నాడు రోహిత్ శర్మ. రోహిత్ సారధ్య బాధ్యతలు అందుకున్న తర్వాత టీమిండియా సక్సెస్ రేటు ఎంతగానో పెరిగిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక భారత క్రికెట్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా కూడా గుర్తింపును సంపాదించుకున్నాడు రోహిత్ శర్మ. అయితే గతంలో ఐపీఎల్ లో ఐదు సార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గా ఉన్నారు రోహిత్. ఇక ఇప్పుడు టీమిండియా కెప్టెన్ గా కూడా అంతే సక్సెస్ అవుతున్నాడు అని చెప్పాలి.

 ఈ ఏడాది ఇండియా వేదికగా జరిగిన వరల్డ్ కప్ టోర్నీలో ఏకంగా భారత జట్టుకు వరుస విజయాలను అందించడమే కాదు ఏకంగా టీమ్ ఇండియాను చాలా ఏళ్ల తర్వాత ఫైనల్ కు తీసుకు వెళ్ళగలిగాడు. ఫైనల్లో టీమ్ ఇండియా తడవాటుకు గురైంది. కానీ లేదంటే భారత జట్టు ఉన్న జోరుకి ఒకవేళ వరల్డ్ కప్ టైటిల్ గెలిచి ఉంటే మాత్రం ఇక రోహిత్ శర్మ కెప్టెన్సీ పై ఎంతల ప్రశంసలు కురిసేవో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక 2024 t20 వరల్డ్ కప్ లో మళ్ళీ పొట్టి ఫార్మాట్లో భారత జట్టును ముందుకు నడిపించేందుకు సిద్ధమయ్యాడు రోహిత్ శర్మ.

 ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఎంతోమంది పేమెంట్ గా చట్టం చూపే ప్రశంసలు కురిపించగా.. ఇటీవల టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సైతం ఈ విషయంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ గ్రేట్ కెప్టెన్ అంటూ కొనియాడాడు. అతను ఐపీఎల్లో ఐదు ట్రోఫీలు సాధించాడని.. వరల్డ్ కప్ లో కూడా జట్టును ఫైనల్స్ వరకు చేర్చాడు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక తాను తన కెరియర్లో కేవలం 40 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడాలనని.. 45 టెస్టులకు 12వ ఆటగాడిగా ఉన్నాను అంటూ గుర్తు చేసుకున్నాడు యువరాజ్ సింగ్. కాగా మరిన్ని ఆడి ఉంటే బాగుండేది అంటూ అభిప్రాయపడ్డాడు తనకు మెంటర్ గా ఉండడం ఇష్టమని భవిష్యత్తులో యువ ఆటగాళ్ల కోసం పని చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు యువరాజ్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: