అయ్య బాబోయ్.. 30 ఏళ్లకు అతనికి అదృష్టం కలిసొచ్చింది?

praveen
టి20 ఫార్మాట్ అంటేనే కుర్రాళ్ళ క్రికెట్ అని చెబుతూ ఉంటారు. ఎందుకంటే ఇక పొట్టి ఫార్మాట్లో ఎక్కువగా కొత్తగా జట్టు లోకి వచ్చిన ఆటగాళ్లే కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి ఇటీవల కాలంలో 18 ఏళ్ల వయస్సు కూడా నిండని వారు ఇక దేశవాళి టోర్నీలలో సత్తాసత్తా చాటి అంతర్జాతీయ క్రికెట్లోకి కూడా అడుగు పెడుతున్నారు అని చెప్పాలి. ఇక ఇలా అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు  పెట్టడమే కాదు అద్భుతమైన ప్రదర్శన తో ఆకట్టుకుంటున్నారు.

 ఇలా ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్న కుర్రాళ్ళకి టి20 ఫార్మాట్లో ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా అవకాశం ఇవ్వడానికి ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తూ ఉంటాయి. ఇక ఎవరైనా క్రికెటర్ 30 ఏళ్ల వయసు దాటి పోయింది అంటే చాలు అతని స్థానం లో మరో యంగ్ ప్లేయర్ ను రీప్లేస్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఒక క్రికెటర్ మాత్రం ఏకంగా 30 ఏళ్ల వయసులో టి20 ఫార్మాట్ లోకి అరంగేట్రం చేశాడు అని చెప్పాలి. ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారి పోయింది.

 ఇటీవల టీమిండియా తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ రహమత్ షా అంతర్జాతీయ టి20 లలో అరంగేట్రం చేసాడు. దీంతో ఇంటర్నేషనల్ టి20 లలో ఆఫ్ఘనిస్తాన్ తరఫున 30 లేదా అంతకంటే ఎక్కువ వయసు లో అరంగేట్రం  చేసిన తొలి ప్లేయర్ గా నిలిచాడు రహమత్ షా. కాగా ప్రస్తుతం అతని వయస్సు 30 ఏళ్ల 189 రోజులు కావడం గమనార్హం. ఇకపోతే ఇటీవల ఆఫ్ఘనిస్తాన్, టీమిండియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగ భారత జట్టు ఘన విజయాన్ని అందుకుంది. రెండో టి20 మ్యాచ్ లో కూడా గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవడానికి సిద్ధమవుతుంది టీమిండియా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: