హాలీవుడ్ హీరో రేంజ్ లో.. హెలిక్యాప్టర్ తో మైదానంలో దిగబోతున్న డేవిడ్ వార్నర్?

praveen
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ డేవిడ్ వార్నర్ ఇటీవల టెస్ట్ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ తో ఇక సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్ కి వీడ్కోలు పలికాడు. ఇక అంతకుముందు వన్డే ఫార్మాట్ కి కూడా రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం కేవలం టి20లలో మాత్రమే కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇటీవల టెస్ట్ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్.. ఇప్పుడు బిగ్ బాస్ లీగ్ లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాడు. సిడ్నీ థండర్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కాగా నేడు సిడ్ని సిక్సర్ తో జరగబోయే మ్యాచ్ లో ఆడబోతున్నాడు.

 అయితే డేవిడ్ వార్నర్ ఎన్నోసార్లు ఇప్పటివరకు బిగ్ బాష్ లీగ్ లో ఆడాడు. మంచి ప్రదర్శనలు కూడా చేశాడు. కానీ ఇందులో కొత్తగా చెప్పుకోవడానికి ఏముంది అనుకుంటున్నారు కదా. అయితే ఇక ఇప్పుడు బిగ్ బాస్ లీగ్ లో భాగంగా నేడు డేవిడ్ వార్నర్ ఆడబోయే మ్యాచ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది చెప్పాలి. ఎందుకంటే ఏకంగా నేడు జరగబోయే మ్యాచ్ లో హాలీవుడ్ హీరో రేంజ్ లో డేవిడ్ వార్నర్ హెలికాప్టర్లో మైదానంలో అడుగుపెట్టబోతున్నాడు.
 ఈరోజు ఉదయం హంటర్ హాలీ ప్రాంతంలో డేవిడ్ వార్నర్ సోదరుడు వివాహం జరుగుతుంది. ఇక ఈ ప్రాంతం మ్యాచ్ జరగాల్సిన సిడ్నీ గ్రౌండ్ కు దాదాపు 250 కిలోమీటర్ల దూరం ఉండడంతో.. సిడ్నీ సిక్సర్స్, సిడ్ని తండర్స్ మ్యాచ్ కు వివాహం అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలికాప్టర్లో సిడ్నికి బయలుదేరబోతున్నాడు. ఇక ప్రేక్షకులను స్టేడియంలో అనుమతించడానికి ముందే డేవిడ్ వార్నర్ ఏకంగా మైదానంలో ఇక హెలికాప్టర్ తో దిగబోతున్నాడు అని చెప్పాలి. ఈ విషయాన్ని సిడ్నీ తండర్స్ జట్టు అధికారికంగా తెలిపింది. అయితే లీగ్ దశలో సిడ్నీ థండర్స్ ఇంకా మూడు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. మూడు మ్యాచ్లు జరిగిన తర్వాత డేవిడ్ బాయ్ దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టి20 లీగ్ లో ఆడెందుకు యూఏఈ బయలుదేరబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: