ఏంటీ.. ఐపీఎల్ మ్యాచ్లు శ్రీలంకలో నిర్వహిస్తారా?

praveen
ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ నిర్వహణ బిసిసిఐకి పెద్ద టాస్క్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. మార్చి నెలలో ఈ టోర్నీ ప్రారంభం కావాల్సి ఉంది. అదే సమయంలో ఇక పార్లమెంటు ఎన్నికలు కూడా ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ను అటు ఇండియా వేదికగా నిర్వహిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారిపోయింది. ఒకవేళ ఇండియా వేదికగా నిర్వహిస్తే ఏదైనా భద్రతపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది అని ఎంతో మంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.

 ఈ క్రమంలోనే ఈ ఏడాది జరగబోయే ఐపీఎల్ సీజన్ ను అటు బీసీసీఐ ఇతర దేశాలకు తరలించే అవకాశం ఉంది అని ఇక ఎంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అనుకుంటున్నారు అని చెప్పాలి.  భారత క్రికెట్ బోర్డు కూడా ఇదే విషయంపై ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో లీగ్ వేదికపై ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఐపీఎల్ 17వ సీజన్  లోని కొన్ని మ్యాచ్లను భారత పొరుగు దేశమైన శ్రీలంకలో నిర్వహించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల బీసీసీఐ సెక్రటరీ జై షా శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ హరిన్ ఫెర్నాండో భేటీ అయ్యారు.

 ఈ క్రమంలోనే ఐపిఎల్ లోని కొన్ని మ్యాచ్లను ఇక శ్రీలంక వేదికగా నిర్వహించాలని జైశాను కోరినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్తలను అటు బిసిసిఐ వర్గాలు తోసిపుచ్చాయి అని చెప్పాలి. టోర్నీని దేశం బయట నిర్వహించే ఆలోచన లేదు. అదే సమయంలో లోకసభ ఎన్నికలు జరుగుతున్నాయ్. ఆ సమయంలో ఏదైనా రాష్ట్రం మ్యాచులకు ఆతిథ్యం ఇవ్వలేదని సరైన కారణం చెప్తే మ్యాచ్లను వేరే వేదికకు మార్చవచ్చు అంటూ బీసీసీఐ తెలిపింది. మరి రానున్న రోజుల్లో పరిస్థితులను బట్టి బిసిసిఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: