విదేశీ పిచ్ లపై.. అలా ఆడితే నష్టం తప్పదు : మంజ్రెకర్

praveen
భారత జట్టు ఇటీవల సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటన లో భాగంగా పరిమిత ఓవర్ల ఫార్మాట్లో అద్భుతం గా రానించిన భారత జట్టు అటు టెస్ట్ ఫార్మాట్ లో మాత్రం ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేక పోయింది. మొదటి టెస్ట్ మ్యాచ్లో అయితే ఎంత దారుణ పరాజయాన్ని చవిచూసిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పనిలేదు. సౌత్ ఆఫ్రికాకు కనీస పోటీ ఇవ్వలేక 32 పరుగులతో పాటు ఒక ఇన్నింగ్స్ తేడాతో ఓడి పోయింది టీమిండియా.

 విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ మినహా మిగతా ఏ బ్యాట్స్మెన్లు కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇక పేలవ ప్రదర్శనతో నిరాశ పరిచాడు అని చెప్పాలి. ఈ క్రమం లోనే టీమిండియా బ్యాటింగ్ విభాగం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తూన్నాయ్. ఫేస్ బౌలింగ్ కి అనుకూలించే పిచ్ పై భారత బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేరు అంటూ ఎంతోమంది విమర్శలు చేస్తూ ఉన్నారు. అయితే రెండో టెస్ట్ మ్యాచ్లో టీమిండియా విజయం సాధించినప్పటికీ..  భారత బ్యాట్స్మెన్లు మాత్రం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు అని చెప్పాలి.

 ఇక ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ క్రికెట్ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రెకర్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఫేస్ బౌలింగ్కు అనుకూలించే సౌతాఫ్రికా సహా విదేశీ పిచ్ లపై డిఫెన్సీవ్ గా ఆడటం వల్లే ఎక్కువగా నష్టం ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు సంజయ్ మంజ్రెకర్. సౌత్ ఆఫ్రికా సిరీస్ లో ఫుల్ షార్ట్ పిచ్, ఫుల్ ఆడేందుకు ప్రయత్నించి ఎక్కువ మంది ఆటగాళ్లు వికెట్లు కోల్పోయారు. డిఫెన్స్ ఆడి వికెట్లు సమర్పించుకునే బదులు దూకుడుగా ఆడితే ఎంతో బాగుంటుంది. ఇక బౌలర్ల లైన్ అండ్ లెంత్ కూడా దెబ్బతింటుంది అంటూ మంజ్రెకర్ సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: