ప్చ్.. మళ్ళీ నిరాశపరిచిన సచిన్ కొడుకు?

praveen
సాధారణంగా సినిమాల్లో కానీ క్రీడల్లో కానీ ఒకరు స్టార్ గా ఎదిగినప్పుడు వారి వారసులుగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యేవారు అచ్చం తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకోవాలని ఇక అభిమానులు అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా వారసులుగా పరిచయం అయ్యే వారిపై ఎన్నో అంచనాలు కూడా పెట్టుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఇలా వారసులుగా వచ్చినవారు ఒకవేళ అంచనాలను అందుకోలేకపోతే.. అభిమానులు ఎంతలా నిరాశ చెందుతారో మాటల్లో వర్ణించడం కూడా కష్టమే.

 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ విషయంలో కూడా అభిమానులకు ఇలాంటి నిరాశ ఎదురవుతూ వస్తుంది. ఎంతోమంది భారత క్రికెట్లు ఏకంగా 20 ఏళ్లు కూడా నిండకముందే దేశవాళీ టోర్నీలలో సత్తా చాటుతూ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెడుతూ ఉంటే.. ఇక పాతికేళ్లకు చేరువవుతున్న అర్జున్ టెండూల్కర్ మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేదు. సచిన్ టెండూల్కర్ వారసుడు కదా క్రికెట్ దేవుడు లాగానే ఇతను కూడా అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు అని అందరూ అనుకున్నారు. కానీ ప్రతిసారి అర్జున్ టెండూల్కర్ విషయంలో అభిమానులకు నిరాశ ఎదురవుతూ వస్తుంది.

 ఇటీవల రంజీల్లో ఎంతో పేలవంగా ప్రారంభించాడు. గోవా తరుపున ప్రాతినిధ్యం వహించిన ఈ ఆటగాడు త్రిపురతో జరిగిన మ్యాచ్ లో పేలవ ప్రదర్శనతో నిరసిపరిచాడు. బౌలింగ్ లో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. అనంతరం బ్యాటింగ్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి వికెట్ సమర్పించుకున్నాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన అర్జున్ ఇక జట్టును ఆదుకోవడంలో విఫలం అయ్యాడు అని చెప్పాలి. అయితే గత ఏడాది విజయ్ హజారే ట్రోఫీలో అర్జున్ ప్రదర్శన బాగానే ఉంది. 11 వికెట్లతో అదరగొట్టాడు  ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నీ రంజీ ట్రోఫీలో అతడి పై భారీ అంచనాలు ఉండగా చివరికి నిరాశపరిచాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: