వరల్డ్ నెంబర్ వన్ ను.. చిత్తుగా ఓడించిన భారత్?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఇండియా పర్యటనలో ఉంది. ఈ క్రమంలోనే ఇక స్వదేశీ పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా తో భారత జట్టు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఈ రెండు టీమ్స్ మధ్య టి20 సిరీస్ ప్రారంభమైంది. అయితే సాధారణంగా టి20 సిరీస్ లో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టును ఓడించడం అంత సులమైన విషయం కాదు. కానీ సొంత గడ్డపై భారత జట్టు ఎంత పటిష్టమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో బంతికి బ్యాట్ కి మధ్య హోరాహోరీ సమరం జరగడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేశారు.

 ఈ క్రమంలోనే ఈ హోరాహోరీ సమరంలో ఎన్నో రికార్డులు కూడా బద్దలవ్వడం ఖాయమని అటు క్రికెట్ ప్రేక్షకులు కూడా భావించారు అని చెప్పాలి. ఇక అందరూ అనుకున్నట్లుగానే మొదటి టి20 మ్యాచ్ ప్రేక్షకులు అందరికీ ఉత్కంఠతో అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పాలి. ఇక ఇటీవల జరిగిన తొలి t20 మ్యాచ్ లో ఆస్ట్రేలియా మహిళల జట్టును భారత జట్టు చిత్తుగా ఓడించింది. ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ లో భారత బాటర్లు అదరగొట్టేశారు.

 ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 142 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే ఓ మోస్తారు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు.  17.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది అని చెప్పాలి. షాఫాలి వర్మ 44 బంతుల్లో 64 పరుగులు చేసి అదరగొట్టగా 52 బంతుల్లో 54 పరుగులు చేసి స్మృతి మందాన హాఫ్ సెంచరీ తో రాణించింది. దీంతో ప్రస్తుతం టి20 ఫార్మాట్లో వరల్డ్ నెంబర్వన్ గా కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టును తొమ్మిది వికెట్ల తేడాతో ఓడించి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది టీమిండియా. దీంతో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ లో 1-0తో ఆదిక్యాన్ని సంపాదించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: