మళ్లీ కోహ్లీ కెప్టెన్ అయితే బాగుంటుంది.. మాజీ క్రికెటర్ కామెంట్స్ వైరల్?

praveen
మహేంద్ర సింగ్ ధోని నుంచి మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్సీ బాధ్యతలు  అందుకున్న విరాట్ కోహ్లీ ఎన్నో ఏళ్లపాటు జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు అన్న విషయం తెలిసిందే. అయితే గత ఏడాది అనూహ్య పరిస్థితుల మధ్య విరాట్ కోహ్లీ సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇక ప్రస్తుతం జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అయితే ఇక ప్రస్తుతం భారత జట్టు దక్షిణాఫ్రికా తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా కీలకమైన ఇన్నింగ్స్ లో ఆడుతున్నాడు అన్న విషయం తెలిసిందే.

 అయితే విరాట్ కోహ్లీ చేతి నుంచి సారధ్య బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ ఇక జట్టును అదే రీతిలో విజయవంతంగా ముందుకు నడిపిస్తూ ఉండడం గమనార్హం. అయితే కోహ్లీ కెప్టెన్సీ నుంచి ఇన్నాళ్ల తర్వాత కోహ్లీ మళ్ళీ టెస్ట్ కెప్టెన్ గా మారితే బాగుంటుంది అంటూ ఒక మాజీ క్రికెటర్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. టెస్ట్ కెప్టెన్సీ నుంచి విరాట్ వైదొలగడం సరికాదు అంటూ భారత మాజీ క్రికెటర్ బద్రీనాథ్ అభిప్రాయపడ్డాడు. సుదీర్ఘ ఫార్మాట్లో మంచి రికార్డు ఉన్న విరాట్ కోహ్లీ నాయకత్వంలో కొనసాగితే బాగుండేది అంటూ చెప్పుకొచ్చాడు. అసలు అతను ఎందుకు వైదోలగ వలసి  వచ్చింది అంటూ ప్రశ్నించాడు.

 టెస్ట్ జట్టు సారథిగా కోహ్లీ రికార్డు అద్భుతం. దాదాపు 5వేలకు పరుగులను 52 సగటుతో సాధించాడు. ఇక 68 టెస్టుల్లో నాయకత్వం వహించగా 40 విజయాలు నమోదు చేశాడు. మరో 17 మ్యాచ్ లో భారత్ ఓడింది. ఆస్ట్రేలియాపై అద్భుతమైన విజయాలు ఉన్నాయి. గ్రేమ్ స్మిత్, రికీ పాంటింగ్, స్టీవ్ వా తర్వాత అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన కెప్టెన్గా విరాట్ కోహ్లీ ఉన్నాడు. అలాంటి  విరాట్ కెప్టెన్సీ వదిలేయడం సరికాదు. టెస్టుల్లో రోహిత్ శర్మ కంటే కోహ్లీ అద్భుత బ్యాట్స్మెన్. నైపుణ్యం పరంగా కూడా కోహ్లీనే బెటర్ అంటూ భారత మాజీ క్రికెటర్ బద్రీనాథ్ చేసిన కామెంట్లు కాస్త సంచలనంగా మారిపోయాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: