నా తర్వాత.. ఆస్ట్రేలియాకు అతనే ఓపనర్ : వార్నర్

praveen
ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు ఇక తమ కెరియర్ కు చివరి రోజుల్లో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచి ఫామ్ లో కొనసాగుతూ ఉన్నప్పటికీ వయస్సు దృశ్య ఇక మరికొన్ని రోజుల్లో అటు క్రికెట్కు వీడ్కోలు పలకాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. ఇలా రిటైర్మెంట్కు రెడీగా ఉన్న క్రికెటర్లలో ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ కూడా ఒకరు. ఆస్ట్రేలియా జట్టు తరఫున ఓపెనర్గా వార్నర్ ఆడిన వీరోచితమైన ఇన్నింగ్స్ ల గురించి క్రికెట్ ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.


 అటు బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా తన ఆట తీరుతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. అయితే మరికొన్ని రోజుల్లో అతను తన టెస్ట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కు ముందే ఈ విషయాన్ని ప్రకటించాడు డేవిడ్ వార్నర్. అయితే ఇక డేవిడ్ వార్నర్ దాదాపు దశాబ్ద కాలం నుంచి ఆస్ట్రేలియా జట్టుకు రెగ్యులర్ ఓనర్ గా కొనసాగుతూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు అలాంటి ఆటగాడు టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే అతని స్థానంలో ఎవరు ఓపెనర్ గా వస్తే బాగుంటుంది అనే చర్చ జరుగుతుంది.


 అయితే ఇటీవల ఇదే విషయం గురించి ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటీవలే ఒక స్పోర్ట్స్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న డేవిడ్ వార్నర్ కు ఇదే విషయంపై ప్రశ్న ఎదురైంది. మీరు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత ఇక ఆ స్థానంలో ఎవరు ఆస్ట్రేలియా ఓపెనర్ గా బాగుంటుంది అంటూ ప్రశ్న ఎదురవుగా.. డేవిడ్ వార్నర్ మాట్లాడుతూ.. నా ఉద్దేశంలో అయితే మార్గస్ హరీష్ అయితే ఓపెనర్ గా సరిగ్గా సరిపోతాడు. చాలా కాలంగా అతను చెమటోడుస్తున్నాడు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. సెలెక్టర్లు అతనిపై నమ్మకం ఉంచితే.. అచ్చం నాలాగే ఆడతాడు అనిపిస్తుంది అంటూ డేవిడ్ వార్నర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: