చిరంజీవి లేకపోతే.. ఈపాటికి హిమాలయాలకు వెళ్లేవాడిని : వెంకటేష్
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఇటీవల కాలంలో ఎక్కువగా మల్టీ స్టార్ సినిమాలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. అయితే ఇక సైంధవ్ అనే ఒక క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు అని చెప్పాలి. అయితే వెంకటేష్ ఇటీవల తన కెరియర్లో ఏకంగా 75 సినిమాలను పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల ఎంతో మంది టాలీవుడ్ లోని ప్రముఖులను అతిథులుగా పిలిచి గ్రాండ్ ఈవెంట్ నిర్వహించాడు వెంకటేష్.
ఇక ఈవెంట్ కి అటు మెగాస్టార్ చిరంజీవితోపాటు ఎంతో మంది యువ హీరోలు కూడా వచ్చారు. అయితే ఇక ఈవెంట్లో మాట్లాడిన వెంకటేష్ తన కెరియర్ గురించి ఆసక్తి గల వ్యాఖ్యలు చేశాడు. మెగాస్టార్ చిరంజీవి లేకపోతే తాను ఈపాటికి హిమాలయాలు వెళ్లిపోయేవాడిని అంటూ విక్టరీ వెంకటేష్ చెప్పుకొచ్చాడు. పరిశ్రమలో 9 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చి కూడా ఖైదీ నెంబర్ 150 తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు చిరంజీవి. అప్పుడే నాకు అర్థమైంది. ఈ నటన అనేది ఆగకూడదని.. మేము ఎప్పటికీ సినిమాలు కొనసాగిస్తూనే ఉండాలి అని అర్థమైంది అంటూ వెంకటేష్ చెప్పుకొచ్చారు. అయితే నాగార్జున మహేష్ బాబు లాంటి హీరోలు ఈవెంట్ కు హాజరు కాకపోవడం కూడా చర్చనీయాంశంగా మారిపోయింది.