RCB ప్లేయర్ కి మరో షాక్.. శిక్ష అనుభవించాల్సిందే?
అంతేకాదు ఒకవేళ ఇలాంటి ఘటన జరిగింది దేశవాళీ క్రికెట్ లీగ్ అయితే ఆ లీగ్ నిర్వాహకులు.. అంతర్జాతీయ మ్యాచ్ అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఇలా అంపైర్లతో వాగ్వాదానికి దిగిన ఆటగాళ్లపై చర్యలు తీసుకోవడం చూస్తూ ఉంటాము. అందుకే ఎంతో మంది క్రికెటర్లు ప్రొఫెషనల్ క్రికెట్లో ఇక ఎంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. ఇలా నిబంధనలు ఉల్లంఘించడానికి అస్సలు సాహసం చేయరు. అయితే ఇటీవల బిగ్ బాష్ లీగ్ లో ఎంపైర్ తో ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ టామ్ కరణ్ అనుచితంగా ప్రవర్తించాడు.
దీంతో బిగ్ బాస్ లీగ్ నిర్వాహకులు అతనిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు నాలుగు మ్యాచ్ల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు అని చెప్పాలి. అయితే ఈ నిషేధం ఎత్తివేయాలి అంటూ అతను ప్రాతినిధ్యం వహిస్తున్న సిడ్నీ సిక్సర్స్ జట్టు అటు బిగ్ బాష్ లీగ్ నిర్వాహకులను విజ్ఞప్తి చేసింది ఇక ఈ విషయంలో మరోసారి అతనికి షాప్ తగిలింది. నిషేధం ఎత్తివేయాలంటూ సిడ్నీ సిక్సర్ చేసిన రిక్వెస్ట్ ను బిగ్ బాస్ లీగ్ యాజమాన్యం తిరస్కరించింది. దీంతో జనవరి 3 నుంచి అతను బిగ్ బాస్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంది కాగా ఇక ఇటీవల జరిగిన 2024 ఐపీఎల్ మినీ వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అతన్ని కొనుగోలు చేసింది అన్న విషయం తెలిసిందే.