యువ ఆటగాడి పాలిట శాపంగా.. ఐపీఎల్ వేలంలో పొరపాటు?

praveen
భారత క్రికెట్ ప్రేక్షకులు అందరూ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన ఐపీఎల్ మినీ వేలం ఇటీవలే ముగిసింది. ఈ క్రమంలోనే అందరూ ఊహించినట్లుగానే వేలంలో పాల్గొన్న ఎంతో మంది స్టార్ ప్లేయర్లకు రికార్డు స్థాయి ధర పలికింది అని చెప్పాలి. ముఖ్యంగా వరల్డ్ కప్ గెలిపించిన జట్టులో ఆటగాళ్లుగా కొనసాగిన వారికి ఏకంగా ఐపీఎల్ ప్రైస్ మనీ కంటే ఎక్కువ ధర పలకడం గమనార్హం.  అన్ని ఫ్రాంచైజీలు కూడా తమ జట్టు కోసం అవసరమైన ఆటగాళ్ళను తీసుకునేందుకు ఎక్కడ వెనకడుగు వెయ్యలేదు. ఎంత ధర పెట్టెందుకైనా సిద్ధపడ్డాయి అని చెప్పాలి.

 అయితే ఇప్పటికే వరల్డ్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చి తమ సత్తా ఏంటో నిరూపించుకున్న స్టార్ ప్లేయర్లకు మాత్రమే కాదు దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న కుర్రాళ్ళకి కూడా కోట్ల రూపాయల ధర పలికింది అని చెప్పాలి. దీంతో ఆర్థిక కష్టాలతో ఇక క్రికెట్ కెరియర్ ను కొనసాగిస్తున్న ఎంతోమంది క్రికెటర్లు కోటీశ్వరులుగా మారిపోయారు. అయితే అంతా బాగానే ఉంది. కానీ ఐపీఎల్ వేలంలో జరిగిన ఒక పొరపాటు గురించి ప్రస్తుతం అందరూ చర్చించుకుంటున్నారు. వినడానికి ఇది చిన్న పొరపాటు లాగే ఉన్నప్పటికీ ఒక కుర్రాడి కెరియర్ కి ఒక పెద్ద దెబ్బ పడింది అని చెప్పాలి.

 మొత్తంగా ఐపీఎల్లో 333 ఆటగాళ్లు వేలంలో పాల్గొన్నారు. అయితే ఇందులో కొంతమంది పేర్లు ఒకే లాగా ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ చేసిన పొరపాటు ఓ ఆటగాడి పాలిట వరంగా.. ఇంకో యువ క్రికెటర్ పాలిట శాపంగా మారింది. 32 ఏళ్ల శశాంక్ సింగ్ 20 లక్షల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చాడు. వెంటనే పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా సిగ్నల్ ఇవ్వడంతో ఇక అతన్ని పంజాబ్ జట్టు దక్కించుకున్నట్లు ఆక్షనర్ ప్రకటించాడు. కానీ 19 ఏళ్ళ యువ ఆటగాడు శశాంక్ సింగ్ అనుకుని పంజాబ్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో పొరపాటు జరిగిపోయింది. ఇక ఈ విషయం తెలిసి అందరూ తర్వాత అవాక్కయ్యారు. ఇక ఈ చిన్న పొరపాటు ఏకంగా యువ ఆటగాడి పాలిట శాపంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: