కోహ్లీతో గొడవపడిన క్రికెటర్ పై.. 20 నెలల నిషేధం?

praveen
నవీన్ ఉల్ హక్.. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ సీజన్ వరకు కూడా ఇతను ఎవరో చాలామందికి తెలియదు. ఒకవేళ తెలిసినా కేవలం కొంతమంది క్రికెట్ ప్రేక్షకులకు మాత్రమే తెలుసు. ఆ క్రికెట్ ప్రేక్షకులు కూడా ఆఫ్గనిస్తాన్ కు చెందినవారు. ఎందుకంటే ఇతను ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ కావడంతో ఇతను ఒక క్రికెటర్ అన్న విషయం వాళ్లకు తెలిసే ఉంటుంది. కానీ మిగతా క్రికెట్ ప్రేక్షకులకు మరీ ముఖ్యంగా ప్రపంచ క్రికెట్కు ఇతను పరిచయమైంది మాత్రం తన ఆట తీరుతో కాదు ఏకంగా ఒక వివాదంతో. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న విరాట్ కోహ్లీతో వివాదాన్ని పెట్టుకొని ఇక వరల్డ్ క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు ఇతగాడు.


 ఇక ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఐపీఎల్లో అవుట్ అయిన ప్రతిసారి కూడా మ్యాంగోస్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విరాట్ కోహ్లీ అభిమానులకు ఆగ్రహం తెప్పించి వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే ఇతని టార్గెట్ చేస్తూ కోహ్లీ అభిమానులు ఎంతలా ట్రోల్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే వరల్డ్ కప్ సమయంలో మాత్రం విరాట్ కోహ్లీని ఆలింగనం చేసుకుని.. వారిద్దరి మధ్య ఉన్న వివాదానికి స్వస్తి పలికాడు అన్న విషయం తెలిసిందే. దీంతో కోహ్లీ అభిమానులు కూడా శాంతించారు. ఇక ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ ఆఫ్గనిస్తాన్ బౌలర్.


 అయితే ఇప్పుడు నవీన్  ఇలా వార్తల్లో నిలవడానికి కారణం ఏంటో తెలుసా అతనిపై దాదాపు 20 నెలల పాటు నిషేధం పడటమే. నవీన్ ఉల్ హక్ పై ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు 20 నెలల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. షార్జా వారియర్స్ తరఫున అతను తొలి సీజన్ ఆడి 11 వికెట్లు తీశాడు. అయితే సదరు ఫ్రాంచైజీ   మరో ఏడాది కాంట్రాక్టును పొడిగించాలని నిర్ణయించుకోక.. అతను సంతకం చేసేందుకు ససేమిరా అన్నాడు. ఈ క్రమంలోనే నిబంధనల మేరకు ఇలా అతనిపై 20 నెలల పాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇంటర్నేషనల్ లీగ్ టి20 నిర్వాహకులు. కాగా ఇటీవల వన్డే వరల్డ్ కప్ ముగిసిన వెంటనే 24 ఏళ్లకు అతను రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: